తెలంగాణ

16ఎంపీటీసీలకు జనవరి 11న ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16 ఎంపిటిసి స్థానాలకు 2018 జనవరి 11 న పోలింగ్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కొమురంబీం జిల్లాలోని నెట్కూర్, ఆసిఫాబాద్ జిల్లాలోని కౌతాల, కరీంనగర్ జిల్లాలోని గంగాధర, అచ్చంపల్లి, రాజన్న సిర్సిల్లా జిల్లాలోని అంకుశాపూర్, భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం-7, ఖమ్మం జిల్లాలోని జక్కేపల్లి, మహబూబ్‌నగర్ జిల్లాలోని కన్మనూర్, లింగంపల్లి, వనపర్తి జిల్లాలోని గోపాలదినే్న, నల్లగొండ జిల్లాలోని కిష్టాపూర్, ఎర్రబెల్లి, కామారెడ్డి జిల్లాలోని మద్నూరు-2, రంగారెడ్డి జిల్లాలోని కొత్వాల్‌గూడ, జన్‌వాడ, సిద్ధిపేట జిల్లాలోని ఆకునూర్-1 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి వెల్లడించారు. ఈ నెల 27 న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారు. జనవరి 2 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 3 న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఆక్షేపణలు ఏవైనా ఉంటే నాలుగోతేదీ సాయంత్రంలోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఐదో తేదీన దరఖాస్తుల పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. ఆరోతేదీ సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జనవరి 11 న పోలింగ్ జరుగుతుంది. అవసరమైతే జనవరి 12 రీపోల్ నిర్వహిస్తారు. 13 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ వెంటనే ఫలితాలు వెల్లడిస్తామని నాగిరెడ్డి వివరించారు.