తెలంగాణ

వేములవాడ ఆలయ సూపరింటెండెంట్ ఇంటిపై ఏసీబీ దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం సూపరింటెండెంట్ ఇంట్లో గురువారం నాడు అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆలయ సూపరింటెండెంట్ నామాల రాజేందర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. రూ. 2.42 కోట్ల రూపాయల మేరకు అక్రమ ఆస్తులను గుర్తించారు. అయితే, వీటి విలువ మార్కెట్ విలువ ప్రకారం రూ. 5 కోట్లు ఉంటుందని ఏసీబీ డైరెక్టర్ తెలిపారు. రాజేందర్ వివిధ ప్రాంతాల్లో తన కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. వేములవాడలో రూ. 45 లక్షలు విలువచేసే జి ప్లస్ టూ పెంట్ హౌస్‌తో ఒక ఇల్లు, రూ. రూ. కోటి విలువగల నాలుగు అంతస్థుల లాడ్జి, రూ. 10 లక్షలు విలువచేసే నిర్మాణంలో ఉన్న ఒక ఇల్లు, రూ. 5.94 లక్షలు విలువచేసే ఒక ఫ్లాట్, స్థలం కొనుగోలు చేసేందుకు రూ. 30 లక్షలు అడ్వాన్స్ చెల్లింపు, రూ. 20 లక్షల విలువైన 68 తులాల బంగారు ఆభరణాలు, రూ. 44వేల నగదు, రూ. 70 వేలు బ్యాంక్ బ్యాలెన్స్, రూ. 8 లక్షలు విలువచేసే గృహోపకరణాలు, రూ. 15 లక్షలు విలువచేసే కారు, రూ. 5 లక్షలు విలువచేసే మరో కారు, రూ. 60వేలు విలువచేసే మోటార్ బైక్, రూ. లక్ష విలువ చేసే బుల్లెట్ మోటార్ బైక్‌ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చిత్రం..వేములవాడ దేవస్థానం అధికారి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు