తెలంగాణ

రాష్ట్రానికి మరిన్ని మెగా ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రానికి మరిన్ని మెగా ప్రాజెక్టులు రానున్నాయని మంత్రివర్గ ఉప సంఘం వెల్లడించింది. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా రాయితీలు, ప్రోత్సహకాలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం వల్లనే మెగా ప్రాజెక్టులు స్థాపించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని అభిప్రాయపడింది. పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచిన మెగా ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీలు, రాయితీలపై చర్చించింది. రాష్ట్రంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ఉదారంగా రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందనే ఏకాభిప్రాయాన్ని మంత్రివర్గ ఉప సంఘం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల రాయితీలు, ప్యాకేజీల కంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ ప్రోత్సహకాలను ఇస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న రాయితీలు, ప్రోత్సహకాలపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. కొత్తగా రానున్న మెగా ప్రాజెక్టులు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సహకాలపై ప్రభుత్వానికి త్వరలో సిఫారసులు అందజేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రెవిన్యూ ముఖ్య కార్యదర్శులు సోమేశ్‌కుమార్, అజయ్ మిశ్రా, సిఎంఓ అదనపు కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం