తెలంగాణ

రోబోటిక్ శస్త్ర చికిత్సతో క్లిష్టమైన కణితి తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా అరుదైన, క్లిష్టమైన కణితికి రోబోటిక్ శస్తచ్రికిత్స నిర్వహించినట్లు అపోలో క్యాన్సర్ వైద్య సంస్థ తెలిపింది. డాక్టర్ హేమంత్ ఉదయరాజు, డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి నేతృత్వలోని వైద్య బృందం 30 ఏళ్ల వయస్సు కలిగిన యువకునికి అర్టో క్యావల్ పారాగాంగ్లియోమా అనే అరుదైన కణితిని నాలుగు గంటలకు పైగా శ్రమించి క్లిష్టమైన రోబోటిక్ శస్తచ్రికిత్సను నిర్వహించారు. దాదాపు 40 కేసుల్లో ప్రాణాంతకమైన ఈ కణితి ఏ వయస్సు వారిలోనైనా ఏర్పడవచ్చని, యుక్తవయస్కుల్లో సాధారణంగా కనిపిస్తుందని తెలిపారు. వరంగల్‌కు చెందిన బి.రాజు నాయక్ అనే యువకుడు తీవ్ర అనారోగ్యంతో అపోలో క్యాన్సర్ వైద్య సంస్థకు రావడంతో పరీక్షలు నిర్వహించి ఈ కణితిని గుర్తించి తొలగించినట్లు తెలిపారు. అధిక బిపిని నివారించి అనంతరం శస్త్ర చికిత్సను నిర్వహించినట్లు వెల్లడించారు. మత్తుమందు ఇచ్చి శస్త్ర చికిత్స చేసేటప్పుడు ఒకోసారి బిపి పెరిగి పోవడం, ఆకస్మికంగా తగ్గిపోవడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా కణితి అసాధారణ ప్రాంతంలో ఉండడం వల్ల ఎంతో క్లిష్టంగా శస్త్ర చికిత్స చేసినట్లు చెప్పారు. శస్తచ్రికిత్సకు లాపరోస్కోపిక్ లేదా ఓపెన్ లాపరోటమీ కంటే తెలివైన రోబో అందించే రోబోటిక్స్‌ను ఉపయోగించుకోవాలని మాకు తోచిందని డాక్టర్ హేమంత్ వివరించారు. దీంతో తాము విజయవంతంగా చికిత్స పూర్తి చేసినట్లు చెప్పారు.