తెలంగాణ

జనగర్జన వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 21: జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభ అట్టర్ ప్లాప్ అయిందని, ప్రజలు కాంగ్రెస్‌ను పట్టించుకోవడం లేదని తేలిపోయిందని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ శాసనసభ పక్షం కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్ధన్‌రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ, జనగర్జన కోసం కాంగ్రెస్ నాయకులు నెల రోజులుగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసినా 3 వేల మంది కూడా హాజరుకాలేదన్నారు.
జనగర్జన విఫలమైందని కాంగ్రెస్ నేతలు వాళ్లలో వాళ్లే లోపల తన్నుకు చస్తూ, బయటికి మాత్రం సభ సక్సెస్ అయిందని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి ఎద్దేవా చేసారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నాయకులు రాజీనామాలు చేయకుండా తప్పించుకున్న దొంగలని మంత్రి దుయ్యబట్టారు. అధికారం దక్కలేదనే నిస్పృహతో, కనుచూపు మేరలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని గ్రహించి కాంగ్రెస్ నేతలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని అన్నారు.
తాను న్యాయబద్ధంగా రియల్ ఏస్టేట్ వ్యాపారం చేసాను తప్ప రేవంత్‌రెడ్డి మాదిరిగా దొంగ వ్యాపారాలు చేయలేదని మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. కుటుంబ పార్టీగా మారిన కాంగ్రెస్‌లో కొనసాగుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబ పాలన జరుగుతుందని కాంగ్రెస్ నేతలు సిగ్గుఎగ్గు లేకుండా విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. జాతీయ నాయకుడిగా ఎదిగిన జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణలో టిడిపి మాదిరిగా కాంగ్రెస్ కూడా భూస్థాపితం కావడం ఖాయమని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు.