తెలంగాణ

ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి సద్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: గిరిజనులను ప్రగతి పథంలో నడిపించేందుకు ఉద్దేశించిన ఎస్‌టి ప్రత్యేక అభివృద్ధి నిధిని పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని రాష్ట్ర గిరిజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో జరిగిన నోడల్ ఏజెన్సీ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎస్‌టి ప్రత్యేక అభివృద్ధి నిధిని పగడ్బందీగా అమలు చేయాలని, అవసరమైతే కేటాయించిన నిధుల కంటే ఎక్కువ ఖర్చు చేయాలని అన్నారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రంజీవ్ ఆచార్య ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.