తెలంగాణ

వర్శిటీల సంస్కరణలకు దార్శనిక పత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నుండి ఉన్నత విద్యను మరీ ముఖ్యంగా విశ్వవిద్యాలయాలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం దార్శనిక పత్రాన్ని రూపొందిస్తోంది. అనేక దేశాల్లోని కొత్త వర్శిటీలు సైతం మంచి రేటింగ్ సాధిస్తుండగా, వందేళ్లు పూర్తి చేసుకున్న ఉస్మానియా వంటి వర్శిటీలు సైతం ప్రపంచ స్థాయి వర్శిటీలతో పొటీ పడలేకపోవడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. వర్శిటీల్లో సమానత్వం, నాణ్యత, అందరికీ అందుబాటు, ఉద్యోగికత అంశాలను ప్రధానంగా తీసుకుని వీటిని మెరుగుపరచడం ద్వారా పరిశోధన, మార్కెట్ అవసరాలకు అనుగుణమైన సిలబస్, ఆధునిక బోథన పద్ధతులు, విద్యాసంస్థల పరిపాలనలో సంస్కరణలకు చర్యలు చేపట్టనుంది. రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రస్తుత స్థితి- భవిష్యత్ దృష్టిపై శుక్రవారం నాడు విస్తృత చర్చ జరిగింది. ఈ చర్చలో ఇందిరాగాంధీ ఓపెన్ వర్శిటీ మాజీ విసి ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్, ఆంధ్రా యూనివర్శిటీ మాజీ విసి ప్రొఫెసర్ ఆర్ రాధాకృష్ణ, ప్రభుత్వ సలహాదారు పాపారావు, గురుకుల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్, ఉన్నత విద్య కమిషనర్ వాణి ప్రసాద్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, రూసా ప్రతినిధి వెంకటేష్ కుమార్, విసిలు ప్రొఫెసర్ రామచంద్రం, ప్రొఫెసర్ సీతారామారావు, ప్రొఫెసర్ కవిత, ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ గాలబ్ , ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వి వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావులు పాల్గొన్నారని మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. సమగ్రమైన ఒక నివేదిక తయారుచేసి వర్శిటీల వారీ అక్కడ వౌలిక సదుపాయాలు, ప్రభుత్వపరంగా చేయాల్సిన సహాయం, స్థానిక పరిస్థితులను మెరుగుపర్చడం లక్ష్యంగా ఈ నివేదిక రూపొందిస్తామని అన్నారు. చాలా విషయాలపై వీరంతా నిశితంగా లోతుగా అభిప్రాయాలు చెప్పారన్నారు. అంతర్జాతీయ స్థాయికి - భారత్‌లో వర్శిటీలకు- తెలంగాణ వర్శిటీలకు మధ్య ఉన్న అగాధం , దానిని పూడ్చడంపై కూడా చర్చ జరిగిందని అన్నారు. వచ్చే మూడేళ్లకు స్వల్పకాలిక ప్రణాళిక, దీర్ఘకాలిక ప్రణాళికలను తయారుచేస్తామని, ప్రభుత్వ అనుమతి తీసుకుని దానిని అమలచేస్తామని చెప్పారు. పరీక్షల విధానంలో కూడా సంస్కరణలు తీసుకురావల్సి ఉందని పాపిరెడ్డి తెలిపారు. సగటు విద్యార్ధిని మార్కెట్‌లో నిలిపితే ఉపాధికి సమర్థుడిగా తీర్చిదిద్దాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త వర్శిటీలు ఏర్పాటు చేయవద్దని, ఉన్న వర్శిటీలను సంస్కరించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైందని, పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయడం, పోస్టులను భర్తీ చేయడం, వౌలిక సదుపాయాలను కల్పించడంపై కూడా దృష్టి సారిస్తామని అన్నారు.