తెలంగాణ

టీచర్ పోస్టుల భర్తీలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: టీచర్ పోస్టుల సంఖ్యలో, విద్యార్హతల విషయంలో, కనీస మార్కుల విషయంలో ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాట ఆడుతున్నదని తెలంగాణ నిరుద్యోగుల సమావేశంలో పాల్గొన్న వక్తలు మండిపడ్డారు. శుక్రవారం బిసి భవన్‌లో నిరుద్యోగ జాక్ అధ్వర్యంలో జరిగిన నిరుద్యోగ సంఘాల సమావేశానికి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ప్రసంగిస్తూ టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నదని విమర్శించారు. గత డిఎస్‌సిలలో టెట్ పాసైన వారికి డిఎస్‌సి రాసే అర్హత ఉండేదని, ఇప్పుడు టెట్ పాసైనా ఇంటర్-డిగ్రీలలో 50 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన పెట్టడంతో వేలాది మంది డిఎస్‌సి రాసే అర్హత కోల్పోతున్నారని ఆయన తెలిపారు.