తెలంగాణ

పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: పెండింగ్ ప్రాజెక్టుల కోసం నిధులు కేటాయిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. ఆదివారం ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా, హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంఎంటిఎస్ రెండో దశ పనులు గత 12 ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్నాయని, గత ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేసిందని దత్తాత్య్రేయ విమర్శించారు. ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాతే రెండో దశ పనులు వేగవంతమయ్యాయని తెలిపారు. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు అదనపు పనులను వేగవంతం చేసేందుకు రానున్న బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తామని చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని, నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చేసేందుకు రోడ్ల వెడల్పును వేగవంతం చేయాలని, ఇందుకోసం ప్రత్యేయ విధానాన్ని చేపట్డాలని సూచించారు. రైల్వే టెర్మినల్ కోసం భూమి కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కోరనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.