తెలంగాణ

విద్యాసంస్థల్లో వసతులు కల్పిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో జూలై 31వ తేదీ నాటికి సిసి కెమేరాలు, బయోమెట్రిక్ అటెండెన్స్ పరికరాలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, ఎమ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్‌వి.రమణారావు, సాంకేతిక విద్యా బోర్డు కార్యదర్శి యువిఎస్‌ఎన్.మూర్తి తదితరులతో కలిసి సోమవారం సచివాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 1,350 విద్యాసంస్థలు ఉన్నాయని, వాటిలో చదువుతున్న 5 లక్షల మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించాలని నిర్ణయించామని చెప్పారు. ప్రధానంగా టాయిలెట్లు, మంచినీటి సదుపాయం, ఆర్‌ఓ ప్లాంట్లు, సిసి కెమేరాలు ఏర్పాటుచేసి బయోమెట్రిక్ హాజరు పద్ధతిని అమలుచేస్తామన్నారు. పాఠశాలలు ఎక్కువగా ఉన్నందున, వాటిలో మాత్రం దశల వారీ ఈ సౌకర్యాలను కల్పిస్తామని వెల్లడించారు. స్కూళ్లలో కిచెన్ షెడ్లు, విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్ర ఫిర్యాదు చేయవచ్చు
తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదును స్వాగతిస్తున్నామని కడియం శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణలో పద్ధతి ప్రకారమే ప్రాజెక్టులను కొనసాగిస్తున్నామని, గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటాను మాత్రమే ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. గతంలో నీటి వాటా కోసమే ఉద్యమాలు చేయాల్సి వచ్చిందని, నదీ జలాల్లో అన్యాయం జరిగిందని చెప్పామని, ఇప్పుడు మన నీళ్లను మనం వాడుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు.