తెలంగాణ

గొర్రెల కాపరులకు గొప్ప వరం (గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్రంలో మత్స్య, గొర్రెల కాపరుల పంట పండిందని చెప్పవచ్చు. గతంలో ఏ ప్రభుత్వాలూ ఇంతగా మత్స్య, గొర్రెల కాపరుల బాగోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మత్స్య, గొర్రెల కాపరులను ధనవంతులుగా చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చర్యలు చేపట్టారు.
అకుంఠిత దీక్షతో తలసాని శ్రీనివాస్ యాదవ్ పని చేస్తారన్న నమ్మకంతో రాష్ట్ర మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా నియమించారు. గొల్ల, కురుమల సంక్షేమ భవనం, వసతి గృహం ఏర్పాటుకూ ముఖ్యమంత్రి నడుం బిగించారు. గొర్రెల కొనుగోలు కోసం ఎన్‌సిడిసి పథకం కింద కేంద్ర ప్రభుత్వం 398 కోట్ల రూపాయలను రుణంగా ఇచ్చేందుకు సిద్ధపడినప్పటికీ, గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటే ఇవ్వనందుకు రుణం అందలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్ళగానే వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తూ సంతకం చేశారు. ఈ రుణంపై అధిక వడ్డీ భారం పడుతుందని మంత్రి తలసాని ముఖ్యమంత్రికి తెలియజేయడంతో, దానిని పావలా వడ్డీకి లబ్దిదారులైన గొల్ల, కురుమలకు అందజేయడం జరిగింది. ఆ రుణం పూర్తి స్థాయిలో గొర్రెల పెంపకందారులకు అందడం లేదన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమే 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొల్ల, కురుమలకు 75 శాతం సబ్సిడీపై 20 గొర్రెలు, ఒక పొటేలు మొత్తం 21 యూనిట్‌గా గొర్రెల పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
వారంతా గొర్రెలు, బర్రెలను కాస్తూనే ఉండాలా?, ఉన్నత స్థాయికి వెళ్లకూడదా? అంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. వారు అక్కడే పరిమితమై పోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం కాదు. వారికి ఉపాధి కల్పిస్తూ, సంక్షేమం, అభివృద్ధి చేస్తూ ఉన్నత విద్యనూ అభ్యసించేందుకు అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వ ముఖ్యోద్ధేశం.
తెలంగాణ ప్రభుత్వం 2017-18 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ నియోజకవర్గానికి ఒకటి చొప్పున వంద సంచార పశు వైద్య శాలల ఏర్పాటు చేయాలని సంకల్పించింది. సమాచార సాంకేతికతో కూడిన కాల్ సెంటర్‌ను రాష్ట్ర స్థాయిలో 4 అక్షరాల టోల్‌ప్రీ (1962) ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రగతి పథంలో.. చలన చిత్ర రంగం
చలన చిత్ర రంగాన్ని ప్రగతి పథంలో నడిపించాలన్న ఉద్దేశ్యంతో చేపడుతున్న చర్యల్లో భాగంగా ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం అనేక ప్రైవేటు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు 20 నుంచి 40 రూపాయల వరకు సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. కాబట్టి ఆన్‌లైన్ విధానంలో 1.98 శాతంతో ఏ విధమైన అదనపు వసూలు ఉండరాదని ప్రభుత్వం నిర్ణయించింది. సినిమా థియేటర్లలో 5వ ఆట ప్రదర్శనకు అనుమతించాలన్న ప్రతిపాదన హోం శాఖ పరిశీలనలో ఉంది. రాష్ట్రంలోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వద్ద 200 నుంచి 300 సీట్ల సామర్థ్యంతో మినీ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. ఈ రకంగా వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో 2017 సంవత్సరం గడిచిపోయింది. వచ్చే ఏడాది మరిన్ని కార్యక్రమాలు చేపడుతుందని ఆశిద్ధాం.

-వి.ఈశ్వర్‌రెడ్డి