తెలంగాణ

బీజేపీలో కొత్త ఉత్సాహం (గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గెలుపుబిజెపి స్థానిక పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత ఏడాది కాలంగా అనేక అంశాలపై వెనువెంటనే స్పందించడంతో పాటు ఉద్యమాలు చేస్తూ, అసెంబ్లీలోనూ, శాసనమండలిలోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ, ప్రజాచైతన్య కార్యక్రమాలను నిర్వహించడంలో బిజెపి విజయం సాధించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు కేంద్ర మంత్రులు, పార్టీ బాధ్యులు తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో వంతుల వారీ పర్యటించారు. మరో పక్క పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టింది మొదలు డాక్టర్ కె లక్ష్మణ్ నేతలు అందరినీ కలుపుకుంటూ ప్రతి నియోజకవర్గంలో బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయడంలో విజయం సాధించారు. ఒక పక్క ఎంపి బండారు దత్తాత్రేయతోనూ, మరో పక్క పార్టీ శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డితో పాటు పార్టీలోని వివిధ మోర్చాల అధ్యక్షులు, కన్వీనర్లు, జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులతో గత ఏడాది కాలంలో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాలను గెలవడానికి బిజెపి ఇన్‌చార్జిలను నియమించింది. పార్టీ ప్రధానకార్యదర్శి రాం మాధవ్, బీహార్ రాష్ట్ర ఆరోగ్య మంత్రి మంగల్ పాండే, కేంద్ర గనులు, గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బండారు దత్తాత్రేయలను ఇన్‌ఛార్జిలుగా నియమించింది. ఇంకో పక్క శాసనసభ నియోజకవర్గాల్లో బరిలో నిలిపేందుకు ప్రతి నియోజకవర్గం నుండి ఇద్దరు ముగ్గురు అభ్యర్ధులను సిద్ధం చేసింది. వివిధ సందర్భాల్లో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టడం, అస్తవ్యస్థమైన ఆర్థిక పరిస్థితిపైనా, వ్యవస్థీకృత అవినీతిపైనా బిజెపి గట్టిగా స్పందించింది. గాడితప్పిన విద్యారంగం- కోరలు సాచిన నిరుద్యోగంపైనా, మద్యం మహమ్మారిపైనా, హామీలు అమలుచేయడంలో ప్రభుత్వ వైఫల్యంపైనా రాష్ట్ర ప్రభుత్వ మత రాజకీయాలు, అధికార దుర్వినియోగంపైనా బిజెపి ఉద్యమించింది. ప్రధానంగా వ్యవసాయ రంగం, బిసి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, పరిశ్రమలు, ఆరోగ్య రంగం, యూనివర్శిటీల సంస్కరణ, నిరుద్యోగ దుస్థితి, రిక్రూట్‌మెంట్‌లలో జాప్యం, రైతుల ఆత్మహత్యలు, ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్ కార్డులు, రైతు సమన్వయ సమితుల ఏర్పాటుపైనా బిజెపి ఉద్యమించి విజయం సాధించింది. అవినీతి వ్యతిరేకంగా, దళిత, గిరిజన సమస్యలపైనా, మద్యపానానికి వ్యతిరేకంగా, ముస్లిం సంతుష్టీకరణ విధానాలు, హిందూ వ్యతిరేక విధానాలపైనా ప్రత్యేక సబ్‌కమిటీలను కూడా నియమించింది. పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజాస్పందన సానుకూలంగా ఉండటంతో నేతలు ఉరకలేస్తున్నారు.

-బి.వి.ప్రసాద్