తెలంగాణ

ఒడిదుడుకుల మధ్య సేద్యం (గుర్తుకొస్తున్నాయి 2017)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంటల ఉత్పత్తికి సంబంధించి తెలంగాణ 2017-18 సంవత్సరంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రత్యేకంగా 2017 ఖరీఫ్ సీజన్ నిరాశాజనకంగా ఉంది. అయితే రబీ సీజన్ మాత్రం ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే 2015-16 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 36.28 లక్షల టన్నులు కాగా, 2016-17 లో 54.44 లక్షల టన్నులు వచ్చింది. 2017 ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు సరిగా లేకపోవడం వల్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. తాజా సమాచారం ప్రకారం ఈ ఖరీఫ్‌లో పంటల ఉత్పత్తులు 40 లక్షల టన్నులకు మించకపోవచ్చని భావిస్తున్నారు. అంటే సాధారణ ఉత్పత్తి కంటే దాదాపు 10 లక్షల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోతోంది. మరికొన్ని రోజులు గడిస్తే ఖచ్చితంగా ఉత్పత్తి ఎంత ఉంటుందో స్పష్టమవుతుంది.
నైరుతీ రుతుపవనాల వల్ల కురిసే వర్షమే తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ప్రధాన ఆధారంగా ఉంటోంది. 2017 ఖరీఫ్ సీజన్‌లో నైరుతీ రుతుపవనాల వల్ల 645 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాస్తవంగా 719 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉంది. అంటే 10 శాతం తక్కువగా వర్షపాతం నమోదైంది. జూన్ రెండోవారంలో వర్షాలు ప్రారంభమై, జూలై వరకు బాగానే కురిశాయి. జూలై-ఆగస్టు నెలల్లో దాదాపు 20 రోజులు వర్షాభావం ఏర్పడ్డది. సెప్టెంబర్‌లో మళ్లీ వర్షాలు బాగానే కురిశాయి. దాంతో జలాశయాల్లోకి నీళ్లు వచ్చాయి. కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోకి కూడా నీళ్లు వచ్చాయి. గోదావరిపై ఉన్న ప్రధాన జలాశయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కొంత నీరు చేరింది.
ఖరీఫ్‌లో 108 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉండగా, 81 లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. సీజన్‌లో వర్షాధార పంటలు కాస్త బాగానే ఉన్నప్పటికీ, చెరువులు, కుంటలు, మధ్యతరహా, భారీ జలాశయాల్లోకి అవసరమైన మేరకు నీరు రాకపోవడం వల్ల ఇక్కట్లు ఏర్పడ్డాయి. ఈ కారణంగా పంటల ఉత్పత్తి లక్ష్యం సాధించలేని పరిస్థితి ఏర్పడ్డది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో వర్షాలు రావడం భారీ, మధ్యతరహా, చిన్న తరహా జలాశయాలతో పాటు, చెరువులు, కుంటల్లోకి నీళ్లు వచ్చాయి. కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలంతో పాటు గోదావరి నది, దాని ఉపనదులపై ఉన్న సింగూరు, కడెం, శ్రీపాదఎల్లంపల్లి నిండాయి. కృష్ణాపై ఉన్న నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 312 టిఎంసిలు కాగా, 182 టిఎంసిలు వచ్చాయి. అలాగే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో 90 టిఎంసిలు ఉండాలి, 47 టిఎంసిలు వచ్చాయి. చిన్న జలాశయాలు నిండాయి.
ఖరీఫ్ సీజన్‌లో ప్రభుత్వం ఆరులక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేశారు. యాసంగికి నాలుగు లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 2017-18 రబీ సీజన్ బాగా ఉంటుందని, పంటలు పుష్కలంగా పండుతాయని అంచనావేశారు. ఇప్పటికే యాసంగి పంటలసాగు ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ జలాశయాల ద్వారా 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కృష్ణాపై ఎత్తిపోతల పథకాలు, గోదావరిపై ఎత్తిపోతల పథకాలు పెద్దఎత్తున కొనసాగుత్నుయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టు పనులు పూర్తయితే దాదాపుకోటి ఎకరాలకు సాగునీరు అందుతుందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో దాదాపు 24 లక్షల బోర్‌వెల్స్ ఉన్నాయి. సేద్యానికి ఉచిత కరెంట్‌ను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం 2018 జనవరి 1 నుండి అమల్లోకి వస్తోంది. దీంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో తొమ్మిది గంటలుమాత్రమే కరెంట్ ఇచ్చేవారు. ఇప్పుడు 24 గంటలూ కరెంట్ ఇవ్వాలని నిర్ణయించడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. భవిష్యత్తులో పంటలు సమృద్ధిగా పండుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు.

-పి.వి.రమణారావు