తెలంగాణ

ప్రవేశపరీక్షల నిర్వహణకు యూనివర్శిటీల ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: ప్రవేశపరీక్షల షెడ్యూలు విడుదల కావడంతో నాలుగు విశ్వవిద్యాలయాలు వివిధ ప్రవేశపరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈసారి ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులకు మినహా మిగిలిన అన్ని కోర్సులకు ఆన్‌లైన్‌లోనే ప్రవేశపరీక్షలు జరుగనున్నాయి. ఎమ్సెట్‌ను మే 2న బుధవారం నాడు ప్రారంభించి మే 5వ తేదీ శనివారం వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇసెట్‌ను మే 9న, ఐసెట్‌ను మే 17న నిర్వహించనున్నారు. పిఇ సెట్‌ను మే 20వ తేదీ నుండి వారం పాటు నిర్వహిస్తారు. లా సెట్‌ను మే 25న, పిజి లాసెట్‌ను మే 26న, పిజి ఇసెట్‌ను మే 27న, ఎడ్‌సెట్‌ను మే 31న నిర్వహిస్తారు. ఎమ్సెట్‌ను ఈసారి కూడా జెఎన్‌టియు హెచ్ నిర్వహించనుంది.
గత ఏడాది ప్రశ్నాపత్రం లీకేజీ ఆరోపణలను ఎదుర్కొన్నప్పటికీ వర్శిటీలోని ఎమ్సెట్ కమిటీ ప్రమేయం లేదని తేలడంతో మరోమారు జెఎన్‌టియుకే ఎమ్సెట్ బాధ్యతను అప్పగించారు. దీంతో జెఎన్‌టియు 16 మార్లు ఎమ్సెట్ నిర్వహించిన ఖ్యాతిని దక్కించుకుంది. ఇసెట్‌ను కూడా జెఎన్‌టియు హెచ్ నిర్వహించనుంది. ఐసెట్‌ను కాకతీయ యూనివర్శిటీ, పిఇసెట్‌ను మహాత్మాగాంధీ యూనివర్శిటీ నిర్వహిస్తాయి. ఉస్మానియా యూనివర్శిటీకి లాసెట్, పిజి లాసెట్, పిజి ఇసెట్, ఎడ్ సెట్ నిర్వహణ అప్పగించారు. వచ్చే వారం నుండి సెట్‌ల కమిటీల సమావేశాలు ఉన్నత విద్యామండలిలో జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపరీక్షల షెడ్యూలును ఖరారు చేస్తారు. నోటిఫికేషన్ జారీ, దరఖాస్తు గడువు, హాల్‌టిక్కెట్లు జారీ, ప్రవేశ పరీక్ష, కీ విడుదల, ఫలితాలు, కౌనె్సలింగ్ తదితర అంశాలను ఖరారు చేస్తారు.