తెలంగాణ

రికార్డు స్థాయిలో భూ రికార్డుల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ రాష్ట్రంలో రెవిన్యూ భూ రికార్డుల నవీకరణ పనులు రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్టు రెవిన్యూ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మొహమద్ మహమూద్ అలీ తెలిపారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 10806 గ్రామాల్లోని 2 కోట్ల 30 లక్షల 44వేల 373 ఎకరాలకు ఇప్పటికే 10443 గ్రామాల్లోని 2 కోట్ల 13 లక్షల 18వేల 724 ఎకరాల రికార్డులను నవీకరించామని అన్నారు. ఇందుకు అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. బృందాల నియామకం, శిక్షణ, కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు, రికార్డుల సమీకరణ, డెస్క్ పరిశీలన, గ్రామాల్లో ముందస్తు పరిశీలన, తహసీల్దార్‌ల పరిశీలన, ప్రచురణ వంటి ఒక పద్ధతిని పాటించి నవీకరణ చేపట్టామని అన్నారు. రాష్ట్రంలో 568 మండలాల్లో 10806 గ్రామాలుండగా, 1507 బృందాలను నియమించామని అన్నారు. 363 గ్రామాల్లో పని ప్రగతిలో ఉందని చెప్పారు. ఇంత వరకూ పరిశీలించిన దాంట్లో కోటి 97 లక్షల 10వేల 172 ఎకరాల భూమికి సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జిల్లాల వారీ ప్రగతిని ఉప ముఖ్యమంత్రి వివరించారు.

చిత్రం..పాత్రికేయులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ