తెలంగాణ

4వేల మంది రైతుల ఆత్మహత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిట్యాల, డిసెంబర్ 29: తెలంగాణరాష్ట్రం ఏర్పడితే సాగునీరంది వ్యవసాయం సస్యశ్యామలమవుతుందనుకున్న రైతులు అందుకు విరుద్ధంగా ఉండటంతో తెలంగాణరాష్ట్రం ఆవిర్భావమయ్యాక నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాలలో శుక్రవారం జరిగిన టీ-మాస్ మండల ఆవిర్భావ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. టీ-మాస్ సదస్సుకు హాజరైన రాష్ట్ర కన్వీనర్ జాన్‌వెస్లీతో పాటు పలువురు నాయకులతో కలి సి గద్దర్ అభివాదం చేశారు. ఆటపాటలు, నృ త్యాలు, నాటకాలతో అణగారిన వర్గాల గురించి కులవృత్తులపై పాటలతో ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. అర్రూరి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సదస్సులో గద్దర్ మాట్లాడుతూ తెలంగాణరాష్ట్రం ఆవిర్భవిస్తే తమ బ్రతుకులు మారతాయనుకుని ఆశపడిన రైతాంగానికి అడియాసలుగానే మిగిలాయని వ్యవసాయసాగు లేక పంటల దిగుబడులు అల్లాడిపోయారని తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించాకనే 4వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఎంతో బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఉన్నతవర్గాల పరిపాలన కొనసాగుతుందని అణగారిన వర్గాలు కిందిస్థాయిలోనే ఉంటున్నారని అణగారిన వర్గాలు కులవృత్తులకు చెందిన వారు అన్ని కులాలకు చెందిన వారు అభ్యున్నతిని సాధించాలంటే అణగారిన వర్గాల పరిపాలనతోనే అభివృద్ధిసాధ్యమవుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అణగారినవర్గాలు అన్నీ ఏకంకావాలని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఉన్నతవర్గాలవారు సంపన్నులవుతున్నారని అణగారిన వర్గాలు అభివృద్ధిలోకి రావడంలేదని దొరలపాలనలో పేదలు కులవృత్తిదారులకు నష్టం కలిగిందే తప్ప ఒరిగిందేమీ లేదని విమర్శించారు. దేశం లో కొంతమందే సంపన్నులవుతున్నారని పేద లు పేదలుగానే మిగిలిపోతున్నారని అన్నికులాలకు చెందిన వారు కులవృత్తిదారులు అభివృద్ధి చెందాలన్నదే టీ-మాస్ లక్ష్యమన్నారు. రైతుల కు ప్రయోజనాలు కల్పించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలపై ఉన్నదని రైతులు ఏడ్చిన ఏ రాజ్యం నిలబడలేదని పరోక్షంగా ప్రభుత్వం పై విమర్శలు చేశారు. లక్షలాది మంది యువతీ యువకులు ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో టీ-మాస్ ఫోరం పోటీ చేయనున్నదని టీ- మాస్ అధికారంలోకి వచ్చినట్లయితే రాష్ట్రంలోని పాత్రికేయులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తుందని ప్రతి పాత్రికేయుడికి నెలకు రూ. 30వేల వేతనం చెల్లిస్తుందన్నారు.
చిత్రం..నల్లగొండ జిల్లా చిట్యాలలో టీ-మాస్ సదస్సులో మాట్లాడుతున్న ప్రజాయుద్ధ నౌక గద్దర్