తెలంగాణ

తాటి, ఈత చెట్ల పన్ను రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, డిసెంబర్ 29 : ఉమ్మడి రాష్ట్రంలో గీత కార్మికులు తీవ్ర వివక్షకు గురైనారని, కల్లు డిపోలను రద్దు చేయటంతో కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే మూత పడిన కల్లు డిపోలను తెరిపించి గీతకార్మికులను ఆదుకుందన్నారు. తాటి, ఈత చెట్ల పన్నులను ఈ క్షణం నుండి రద్దు చేస్తున్నట్లు మంత్రి పద్మారావు ప్రకటించారు.
ఎక్సైజ్ అధికారులు ఎవరూ పన్ను వసూలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయానికి వెళ్లి చెట్టు పన్ను రద్దుపై జీవోను జారీ చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శుక్రవారం 1.50 కోట్లతో నిర్మించే గౌడ కల్యాణ మండపానికి మంత్రి హరీష్‌రావు, ఎంపి బూర నర్సయ్య గౌడ్‌తో కలసి శంకుస్థాపన చేశారు. అంతకు మందు రేణుక మాత ఆలయంలో ప్రత్కేక పూజలు చేశారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పద్మారావు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వృత్తి గీతకార్మికులదని అన్నారు. ఇప్పటి వరకు 286 మంది కార్మికులు చెట్టుపై నుండి పడి మృతిచెందారన్నారు. గత ప్రభుత్వాలు గీత కార్మికు పట్ల కక్ష పూరితంగా వ్యవహరించాయన్నారు. తెలంగాణ సర్కార్ అధికారంలో మొదటి కేబినెట్ సమావేశంలో కల్లు డిపోలను తెరిపించారన్నారు. రాష్ట్రంలో 10వేల మంది కార్మికులకు క్లైంబింగ్ మిషన్లు పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఎఫ్‌టీలన్నిటినీ టిఎస్ సొసైటీలుగా మార్చనున్నట్టు మంత్రి పద్మారావు ప్రకటించారు. 8వేల సొసైటీల్లోని సభ్యులందరికీ గుర్తింపు కార్డులు అందచేయనున్నట్టు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ బూమ్ పెరగటం వల్ల ఈత, తాటి వనాలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూరోపియన్ దేశాల్లో నీరా, ఈత కల్లుకు మంచి డిమాండ్ ఉందన్నారు. గీతవృత్తితో రాష్ట్రానికి 5నుండి 10వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రి హరీష్‌రావు బీసీలకు పెద్దన్నగా వ్యవహరిస్తున్నారన్నారు. పరకాల, పాకాల వంటి ప్రాంతాల్లో గిలక తాళ్లు ఏర్పాటుతో ఇప్పుడు 50 లీటర్ల కల్లు ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ విషయంలో చొరవచూపిన మంత్రి హరీష్‌రావుకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్టు తెలిపారు. గీతకార్మిక కుటుంబాల ప్రమాదవశాత్తు మృతిచెందిన ఎక్స్‌గ్రేషయా 2లక్షల నుండి 5లక్షల వరకు పెంచినట్టు తెలిపారు.
సొసైటీలను 10 ఏళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసే లా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. ప్రతి గీత కార్మికునికి ఐడీ కార్డు ఉండాలని, రాష్ట్ర వ్యాప్తం గా 8వేల సొసైటీలలో లక్షలాది గౌడన్నలున్నారన్నారు. గౌడ జాతి అభ్యున్నతే టీఆర్‌ఎస్ సర్కార్ ధ్యేయమన్నారు. గౌడ సమాజం అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్న మంత్రి హరీష్‌రావుపై మంత్రి పద్మారావు ప్రశంసలు కురిపించారు. అనంతరం చంద్లాపూర్‌లో టీఎఫ్‌టీ నుండి సొసైటీసభ్యులకు గుర్తింపు కార్డులు మంత్రి పద్మారావు పంపిణీ చేశా రు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, ఎంపి బూర నర్సయ్యగౌడ్, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఎంపీపీ యాదగిరి, వెంకట్‌గౌడ్, పిఎసీఎస్ చైర్మన్ రమేశ్‌గౌడ్, పరకాల మల్లేశం, గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు చంద్రవౌళి, ఆనగోని నారాయణగౌడ్, మార్క శ్రీనివాస్‌గౌడ్, పల్లె బాలకిషన్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి పద్మారావు