తెలంగాణ

మహబూబాబాద్‌లో సీపీ బాట దళసభ్యుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్,డిసెంబర్ 29: మహబూబాబాద్ జిల్లాలో సీపీ బాట దళసభ్యుడిని అరెస్ట్ చేసి ఆయన నుండి ఒక ఆయుధంతో సహా 25రౌండ్‌లు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ టౌన్‌పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం గూడూరు, కొత్తగూడ ఎస్సైలు గూడూరు మండలం భూపతిపేట కొత్తగూడ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా సీపిబాట దళసభ్యుడు షేర్ మధు అలియాస్ రమాకాంత్ భూపతిపేటలో బస్సు దిగి అడవివైపు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. మధు ఇచ్చిన సమాచారంతో భూపతిపేట అడవుల్లో బోరుతుపాకి, 25రౌండ్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. 2006లో న్యూడెమోక్రసీ గోపన్న మాటలకు ప్రభావితం అయి గోపన్నదళంలో చేరాడు. 2012 వరకు అదే దళంలో కొనసాగాడు. తర్వాత గోపన్న దళంలో భేదాభిప్రాయాలు వచ్చి ఆవునూరి మధు దళంలోకి వెళ్లాడు. 2016 సెప్టెంబర్ మొదటివారంలో పెద్ద ఎల్లాపూర్‌కు చెందిన ఓం ప్రకాష్‌తో పరిచయం అయ్యాడు. ఓం ప్రకాష్ మధును సీపిబాటలో చేరమనగా ఆయన సీపిబాటలో చేరాడు. మణుగూరుకు చెందిన దుబ్బాక ఏసుబాబు అలియాస్ జగ్గన్న, రావుల శ్రీను అలియాస్ జగన్ నేతృత్వంలో భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, భూపాలపల్లి జయశంకర్ జిల్లాలకు చెందిన 11మందితో కలసి 2016సెప్టెంబర్ 9న కూర రాజన్న సీపీఐ ఎంఎల్ జనశక్తి మాజీ కేంద్రకమిటీ సెక్రటరీని కలవడానికి హైద్రాబాద్‌కు ట్రైన్‌లో వెళ్లారు. అక్కడి నుండి వీరిని ఎల్‌బి నగర్‌లో ఉన్న కూర రాజన్న వద్దకు తీసుకెళ్లారు. నాలుగు జిల్లాల పరిధిలో సీపీబాట అనే పోరు సాయుధ దళాన్ని ఏర్పాటు చేయాలని రాజన్న ఆదేశించారు. దళాలకు కావాల్సిన ఆయుధ సంపత్తి, ట్రైనింగ్‌లాంటివి ఏర్పాటు చేయడానికి రాజన్న హామీ ఇచ్చినట్టు ఎస్పీ తెలిపారు. అప్పటివరకు లీగల్ కార్యక్రమాలు చేయాలని సూచించారు. అనంతరం అందరు తిరిగి రైల్లో వెళ్లిపోయారు. అయితే షేర్ మధు ఇంటికి వెళ్లి యధావిధిగా లీగల్ కార్యక్రమాలు చేస్తూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 2017జూలై 18న కూర రాజన్న బబ్లూ అనే వ్యక్తిద్వారా ఒక జీపులో ఎర్రకుంట తండాకు 27ఆయుధాలు, మందుగుండు సామాగ్రి పంపాడు. ఈ విషయం ఎట్టి కుమార్‌కు తెలుపగా షేర్‌మధు, ప్రకాష్ అక్కడి కి వెళ్లారు. అక్కడ ఎట్టి కూమార్, నూతన్, కిరణ్ మొత్తం 19మంది ఉన్నారు. షేర్ మధుకు గతంలో ఉన్న అనుభవంతో తుపాకుల ఫిట్టింగ్ చేశాడు. దళ కమాండర్‌లు అయిన నూతన్, కుమార్‌లు ఎస్‌ఎల్‌ఆర్ ఆయుధాలు తీసుకోగా షేర్‌మధు, ప్రకాష్‌లు 8ఎంఎం బోర్ ఆయుధాలు తీసుకున్నారు. మిగిలిన తుపాకులను ప్రకాష్, మోకాళ్ల సమ్మయ్యలు తీసుకొని దాచిపెడతామన్నారు. అక్కడి నుండి 19మంది ఐదు దళాలుగా ఏర్పడ్డారు. కూర రాజన్న ఆయుధాలు సమకూర్చి యువకులను పార్టీలోకి తీసుకొని డబ్బుల కోసం కాంట్రాక్టర్‌లను, వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని ఆదేశించారు. షేర్ మధు కూర రాజన్నకు కొరియర్‌గా మారాడు. ఓం ప్రకాష్ అప్పుడప్పుడు కూర రాజన్నను కలసి నాలుగు జిల్లాల పరిధిలో పార్టీ కార్యక్రమాల గురించి చెప్పి వారి నుండి ఆదేశాలు తీసుకొని వచ్చి ఆ పార్టీ వారికి చేరవేస్తూ ఉండేవారు. కూర రాజన్న ఆదేశాల ప్రకారం సాయుధ దళాలు వ్యాపారస్థులను, కాంట్రాక్టర్‌లను బెదిరించి డబ్బులు వసూలు చేసేవారు. షేర్ మధుపై రెండు హత్యకేసులు, తుపాకితో బెదిరించిన కేసు, బుధరావుపేటలో అనూష అనే అమ్మాయిని మోసం చేసిన కేసు, సూర్యం దళం లో ఆయుధాలు కలిగి ఉన్న కేసులు ఉన్నాయి.
చిత్రం..విలేఖరుల సమావేశంలో షేర్ మధు అరెస్ట్ చూపుతున్న ఎస్పీ కోటిరెడ్డి