తెలంగాణ

తాడూరు ఎంపీటీసీ ఎన్నిక చెల్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడూరు, డిసెంబర్ 29: 2014 మార్చిలో నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలలో రెండు ఓట్ల మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మీ ఎన్నిక చెల్లదని స్థానిక సీనియర్ సివిల్ కోర్టు జడ్జీ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తీర్పు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2014 మార్చి 29న తాడూరు ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికలలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సంద రేణుక, కాంగ్రెస్ అభ్యర్థిగా విజయలక్ష్మీ, బీజేపీ అభ్యర్థిగా సూర్యకళ పోటీ చేయగా, టీఆర్‌ఎస్ అభ్యర్థి రేణుకపై కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మీ రెండు ఓట్లతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించి ఎన్నిక ధృవీకరణ పత్రం అందచేశారు. దీనితో ఈ ఎన్నికపై రేణుక స్థానిక సీనియర్ సివిల్ కోర్టులో రీ కౌంటింగ్ చేయాలని కోరుతూ కేసు వేయగా, శుక్రవారం తాడూరు ఎంపిటీసీ స్థానానికి జరిగిన ఎన్నికను రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు ఇచ్చారు. తాడూరు ఎంపీటీసీగా ఉన్న విజయలక్ష్మీ ఎన్నిక చెల్లదంటూ సీనియర్ సివిల్ జడ్జి తీర్పు ఇచ్చారని తెలిసిన వెంటనే మండలంలో టీఆర్‌ఎస్ శ్రేణులలో ఆనందం నెలకొంది. కాం గ్రె స్ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారని, దీనిపై టీఆర్‌ఎస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేసినా పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సూచనల మేరకు కోర్టుకు వెళ్లగా ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం జడ్జి ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు.