తెలంగాణ

స్ర్తి నిధి రుణాల వసూలులో మెదక్ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, డిసెంబర్ 29: మహిళా సంఘాలకు స్ర్తి నిధి రుణాల మంజూరు చేయడంతో పాటు సకాలంలో తిరిగి వసూలు చేసినందుకు రాష్ట్రంలో మెదక్ జిల్లా ప్రథమ స్థానంలో నిలువగా, సంగారెడ్డి జిల్లా తృతీయ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
ఇందుకుశుక్రవారం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో నిర్వహించిన స్ర్తి నిధి నాలుగవ సర్వసభ్య సమావేశంలో డిఆర్‌డిఓలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేసారు. మెదక్ జిల్లాలో 2016-17 సంవత్సరానికి మహిళా సంఘాలకు 54 కోట్ల స్ర్తి నిధి రుణాలు ఇవ్వాల్సి ఉండగా 53 కోట్లను మంజూరు చేసారు. ఆ రుణాన్ని 99.99 శాతం తిరిగి వసూలు చేసి ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రథమ స్థానాన్ని దక్కించుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన మెదక్ డిఆర్‌డిఓ సీతారామరావుకు ఉత్తమ అవార్డును మంత్రి చేతులమీదుగా అందజేసారు. సంగారెడ్డి జిల్లాలో 14000 మహిళ సంఘాలకు 68 కోట్ల స్ర్తి నిధి రుణాలు ఇప్పించగా అందులో 98 శాతం రికవరీ చేసి రాష్ట్రంలో మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇందుకుగాను సంగారెడ్డి జిల్లా డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లుకు మంత్రి చేతుల మీదుగా అవార్డును ప్రధానం చేసారు.
అవార్డును అందుకున్న డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కలెక్టర్ సూచనలు, ఆదేశా ల మేరకు జిల్లాలో ఉన్న మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి, సెర్ఫ్, ఐకెపి సిబ్బంది నిరంతర కృషితో రుణాలు ఇప్పించి, తిరిగి కట్టేలా చర్యలు తీసుకోవడం వల్లనే రాష్ట్ర స్థాయిలో మూడ వ స్థానంలో నిలిచినట్లు సంతృప్తిని వ్యక్తం చేసారు.

చిత్రం..మహిళా సంఘాల నుండి స్ర్తి నిధి రుణాల రికవరీలో మూడవ స్థానం దక్కించుకుని మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న సంగారెడ్డి జిల్లా డిఆర్‌డిఓ వెంకటేశ్వర్లు