తెలంగాణ

పేదలకు చేయూతనకు సర్కార్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: పేద ప్రజలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ సిద్ధంగా ఉన్నప్పటికీ, బ్యాంకర్లు మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నారు. బిసిలకు చెందిన వివిధ ఫైనాన్స్ కార్పోరేషన్లు, ఎస్‌సి ఫైనాన్స్ కార్పోరేషన్, ఎస్‌టి ఫైనాన్స్ కార్పోరేషన్, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ల ద్వారా 2017-18 సంవత్సరానికి ప్రభుత్వం దాదాపు మూడువేల కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇచ్చేందుకు ప్రణాళికలను రూపొందించింది. సంబంధిత వర్గాల యువతీ యువకులు, ఇతరులు చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు ప్రభుత్వం తరఫున ఆ యా కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీ ఇస్తున్నారు. మొత్తం మూడు వేల కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించగా, బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఎస్‌సిలకు కొన్ని పథకాలకు 90 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, మిగతా 10 శాతం మేరకు రుణాలు ఇచ్చేందుకు కూడా బ్యాంకర్లు సిద్ధంగా లేకపోవడంతో యువతీ యువకులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఒక్కో అభ్యర్థికి బ్యాంకర్లు 10 వేల రూపాయల చిన్న మొత్తం నుండి 10 లక్షల రూపాయల వరకు రుణంగా ఇవ్వాల్సి ఉంది. స్వయం ఉపాధికోసం దరఖాస్తు చేసిన అందరికీ రుణాలు ఇచ్చినా ఈ మొత్తం 10 వేల కోట్ల రూపాయలకు మించవని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇంత మొత్తంలో రుణాలు ఇస్తే రాష్ట్రం మొత్తంలో దాదాపు 10 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
బ్యాంకర్ల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తంలో ఇచ్చిన మొత్తం రుణాలు నాలుగు లక్షల కోట్ల రూపాయలని వెల్లడైంది. ఈ మొత్తంలో బడావ్యాపారులు, బడా పారిశ్రామిక వేత్తల వాటానే 80 శాతం వరకు ఉంది. పెద్దవాళ్లకు, డబ్బున్న వాళ్లకు కోటి రూపాయలు అంతకు మించి కూడా రుణాన్ని చికికెలో బ్యాంకు మేనేజర్లు మంజూరు చేస్తున్నారు. అదే పేద వారిని నెలల తరబడి తమ బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారు. అవసరమైన డాక్యుమెంట్లన్నీ బ్యాంకులకు అందించినా, పేదల పట్ల బ్యాంకు మేనేజర్లు చిన్న చూపు చూస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఈ అంశం ప్రభుత్వ దృష్టికి వచ్చినా పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. రుణాలు ఇవ్వాలంటూ మండలస్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో సంబంధిత అధికారులు, మంత్రులు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, బ్యాంకు మేనేజర్లు, బ్యాంకర్లు నిర్లక్ష్యంగా ప్రవరిస్తున్నారు.