తెలంగాణ

టీఆర్‌ఎస్‌ను ప్రశంసించడంపై కాంగ్రెస్‌లో కుతకుత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: హైదరాబాద్ శివార్లలో శుక్రవారం ముఖ్యమంత్రి కెసిఆర్ గొల్ల కుర్మ భవనానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కర్నాటక మంత్రి రేవణ్ణ కెసిఆర్‌ను ప్రశంసించడంపై టి కాంగ్రెస్ ఆగ్రహంతో కుతకుతలాడుతోంది. ఈ వ్యాఖ్యలను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ కుంతియా సీరియస్‌గా తీసుకున్నారు. ఒక వైపు కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను మట్టికరిపించేందుకు అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న విషయం తెలిసిందే. కెసిఆర్‌ను కర్నాటక మంత్రి రేవణ్ణ ప్రశంసించడం వల్ల పార్టీ ఇమేజికి భంగం వాటిల్లిందని, తాము అన్ని శక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్ధమవుతుంటే, టిఆర్‌ఎస్ పాలనను ఆకాశానికి ఎత్తివేయడం ఏంటని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ఈ విషయమై కుంతియా ఇక్కడ మాట్లాడుతూ ఈ అంశాన్ని పార్టీ అధినేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. ఈ చర్యల వల్ల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మస్ధైర్యం దెబ్బతింటుందని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలన్నారు. సభకు హాజరైన నేత తన పరిధిలో మాట్లాడాలని, అన్ని విలువలను గాలికి వదిలిపెట్టి కెసిఆర్‌ను పొగడడం వల్ల కాంగ్రెస్ బ్రాండ్ ఇమేజికి దెబ్బని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.