తెలంగాణ

కేసీఆర్ పాలనకు చరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: అధికారంలో వచ్చేందుకు అన్ని రకాల హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ అప్రజాస్వామిక పాలనకు చరమగీతం పాడేంతవరకు కాంగ్రెస్ శ్రేణులు విశ్రమించరాదని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరేందుకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, నేతలు ఉత్సాహం చూపుతున్నారని, టిఆర్‌ఎస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. బిజెపి ఆధ్వర్యంలో దేశంలో మతతత్వశక్తులు విజృంభించి మతసామరస్యాన్ని నాశనం చేస్తున్నాయన్నారు. మోదీ నియంతృత్వపాలన వల్ల దేశంలో భయానక వాతావరణం నెలకొందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందన్నారు. లౌకిక, ప్రజాస్వామిక శక్తుల గళాన్ని అణచివేస్తున్నారన్నారు. దళితులు, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేస్తోందన్నారు. ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా పోలీసుల రాజ్యమే కనపడుతోందన్నారు. మున్సిపాలిటీల్లో అపరిశుభ్రత పెరిగిందన్నారు. గ్రామ పంచాయితీల అధికారాలను బదలాయించకుండా అడ్డుకుంటున్నారన్నారు. పరిపాలనలో నిర్లిప్తత పెరిగిందన్నారు. పాతబస్తీలోమెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభం కాలేదన్నారు. డబుల్ బెడ్ రూం స్కీంలు ఒక ఫార్సుగా తయారయ్యాయన్నారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి వ్యవహరిస్తున్న టిఆర్‌ఎస్ పార్టీకి బుద్ధిచెప్పేందుకు ప్రజలు ఆత్రుతతో ఉన్నారన్నారు.

చిత్రం..పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ సిటిజన్లు