తెలంగాణ

మిలిటెంటు నాగయ్య ఏమయ్యాడు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, డిసెంబర్ 31: వేములవాడ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్న అప్పటి పీపుల్స్‌వార్ సానుభూతిపరుడైన ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లికి చెందిన నాగయ్య ఆచూకీ నేటికి లభించ లేదు. మూడు దళాబ్దాలుగా అతని కుటుంబీకులు ఎదురుచూస్తూనే ఉన్నారు. పోలీసుల కళ్లు గప్పి పారిపోయిన నాగయ్య విప్లవపార్టీలో పని చేస్తున్నారా..లేక ఎన్‌కౌంటర్‌లో చనిపోయారా..? అనే ప్రశ్నలను తలెత్తుతున్నారు. 1985లో పీపుల్స్‌వార్ సానుభూతిపరుడైన నాగయ్య అదే గ్రామానికి చెందిన మరో సానుభూతిపరుడితో కలిసి పార్టీ వ్యవహారాలు నడిపించాడు. నక్సల్స్ అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసే దిశలో భాగంగా పార్టీ నాయకత్వం అప్పగించిన పనులపై వెళుతున్న క్రమంలో నాగయ్యను వేములవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే భారీగా ఆర్థిక వనరులను సేకరించాడు. అయతే పోలీస్ స్టేషన్ నుంచి నాగయ్య చాకచక్యంగా తప్పించుకున్నాడు. పోలీసులు ఎన్‌కౌంటర్ చేస్తారని పేర్కొంటూ నాగయ్యను సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామానికి చెందిన మరో సానుభూతిపరుడిని పార్టీ ఆదేశించింది. దాంతో ఆయన నాగయ్యను హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్టు ఆ వర్గాలు తెలిపాయ. అక్కడి నుంచి ముంబయికి మకాం మార్పించారని వార్తలొచ్చాయ. రెండు నెలల అనంతరం సానుభూతిపరుడు ముంబయిలో ఓ మహిళను వివాహం చేసుకుని గ్రామానికి రాగా నాగయ్య ఏమయ్యాడని ప్రశ్నించామని చెప్పారు. ముంబయిలో తప్పిపోయాడని పేర్కొంటూ సదరు సానుభూతిపరుడు రేషన్‌కార్డుపై ఉన్న నాగయ్య ఫొటోను తీసుకెళ్లి తమ వద్ద ఎలాంటి పోటోలు లేకుండా చేశారని వివరించారు. ఇద్దరూ కలిసి సమకూర్చిన ఆర్థిక వనరుల విషయం బయటకు వస్తుందనే అనుమానంతో సదరు సానుభూతిపరుడు నాగయ్యను ప్రాణాలతో లేకుండా చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పట్లో పార్టీ సదరు సానుభూతిపరుడిని టార్గెట్ చేసిందని మాజీలు చెబుతున్నారు. మూడు దశాబ్దాలుగా నాగయ్య ఆచూకీ కోసం కుటుంబీకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. నాగయ్య మాత్రం తమ నుంచి తప్పించుకున్నారని పోలీసు చెబుతున్నారని పేర్కొన్నారు. అతను పార్టీలో ఉన్నారా..? లేక మరణించారా..? పోలీసు ఎన్‌కౌంటర్‌లో కన్నుమూశారా..? అనేది నేటికీ అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందని కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు స్పందించి నాగయ్య అదృశ్య మిస్టరీని ఛేదించాలని వారు కోరుతున్నారు.