తెలంగాణ

రైతులకు మేలుచేస్తుంటే సహించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జనవరి 3: వందేళ్ల ఘనచరిత్ర ఉందని, రాష్ట్రాన్ని, దేశా న్ని ఉద్ధరించామని చెప్పుకునే కాంగ్రెస్‌పార్టీ నేతలు రాష్ట్రంలో రైతుల మేలుకోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తుంటే చూసి ఓర్వలేక నిస్సిగ్గుగా 24గంటల విద్యుత్ వద్దంటూ ప్రకటనలు చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో విపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. నూతన సంవత్సరం నుండి రాష్టవ్య్రాప్తంగా వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్‌ను అందిస్తుంటే రాష్ట్ర రైతాంగమంతా సంబరపడుతుందని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులు తమ రాష్ట్రాలో నిరంతర విద్యుత్ సరఫరాను సాధించుకునేందుకు ఆలోచనలు చేస్తున్నారన్నారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో విచిత్రంగా కాంగ్రెస్, దాని అనుబంధంగా పనిచేస్తున్న జేఎసీ నేతలు రైతులు, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా తమ రాజకీయ ప్రయోజనాలే పరమవధిగా 24 గంటల కరెంటు వద్దంటూ విమర్శలు చేస్తుంటే ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. 24 గంటల విద్యుత్ ప్రారంభం కావడంతో కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్ల్లు పరుగెడుతున్నాయన్నారు. 60 ఏళ్లపాలనలో రాష్ట్రంలో వ్యవసాయాన్ని నాశనం చేసి రైతాంగాన్ని ఆత్మహత్యల పాలు చేసిన ఆపార్టీ వారు నేడు నిరంతరాయంగా విద్యుత్‌ను అందిస్తుంటే రైతులు అడగడం లేదని, 24 గంటలు కరెంటు ఇస్తే నీళ్లు ఉండవని రకరకాల విమర్శలు చేస్తూ ప్రజల ఛీత్కారాలకు గురవుతున్నారన్నారు. నేడు వి ద్యుత్‌ను ఇస్తున్న అడ్డుకుంటున్న కాంగ్రెస్‌నేతలను చూసి టెర్రరిస్టులు సైతం సిగ్గుపడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అమలుచేస్తున్న పధకాలను దేశం, ప్రపంచమంతా అభినందిస్తుంటే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు.