తెలంగాణ

ప్రాజెక్టుల రూపంలో మేధస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలకు శాస్ర్తియ పరిష్కారాలను చూపించిన విద్యార్థుల ప్రతిభా పాటవాలకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మంత్ర ముగ్ధులయ్యారు. విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్ మీరే, మీ మేథస్సును మీ పరిసరాల్లో పైలట్ ప్రాజెక్టు రూపంలో చేయండి అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఎటువంటి వ్యయం లేకుండానే పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించడం ఎలాగో విద్యార్థులు తమ మేథోసంపత్తితో పరిష్కారాలను సూచించారు. నాలుగు రోజులుగా సెయింట్ ప్యాట్రిక్స్ పాఠశాలలో జరుగుతున్న దక్షిణ భారత విజ్ఞాన ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
టి హబ్ మీ లాంటి ప్రతిభావంతులకు వేదికగా ఉందని, మంచి ఐడియాలతో టి హబ్‌కు రావాలని చెప్పారు. కంప్యూటర్లకు బానిసలు కావద్దని, తమ మేథస్సుకు పదును పెట్టాలని పేర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లడం మానొద్దని, విద్యను కొనసాగించాలని అన్నారు. విద్యద్వారానే సంపూర్ణత్వం సిద్ధిస్తుందని గవర్నర్ వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించి, ఎక్కడికక్కడ వాహనాల పార్కింగ్ చేయడం ఎలాగో, వ్యవసాయ ఉత్పత్తుల తేమ తగ్గించడం, సహజ రక్షక్, హేపీ జర్నీ, ఎలక్ట్రిక్ మోటార్, హోలీ జిమ్, గ్యాస్ ఆదా చేయడం, తక్కువ వ్యయంతో బోధన ఉపకరణాలు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఇలా దాదాపు 300 ప్రదర్ళనలను ఈ సైన్స్ ఫెయిర్‌లో ఉంచారు. వీటిలో చాలా వరకూ విద్యార్థులు రూపొందించగా, కొన్నింటిని అధికారులతో కలిసి తయారుచేశారు. ఆరు రాష్ట్రాల నుండి 300 అంశాలపై ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల నుండి 650 మంది విద్యార్థులు, టీచర్లు, 200 మంది వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు.
విజేతలకు మెరిట్ సర్ట్ఫికేట్లను గవర్నర్ , ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అందజేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ అబ్దుల్ కలాం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశం గర్వించే డాక్టర్లు ఇంజనీర్లు కావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో హోం మంత్రి నాయని నర్సింహారెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ శేషుకుమారి, మోడల్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈఓ పోస్టులకు అర్హతల సడలింపు
సూపర్‌వైజర్ గ్రేడ్-1 ఎక్స్‌టన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులకు నిర్దేశించిన అర్హతలకు మించి ఉన్నత విద్య ఉంటే అటువంటి వారిని కూడా పరీక్ష రాసేందుకు అనుమతిస్తున్నట్టు పబ్లిక్ సర్వీసు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్‌లైన్‌లో ఈ నెల 24వ తేదీ వరకూ తమ బయోడాటాలను సవరించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు.
ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్లు
తెలంగాణ రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో 2018-19 విద్యాసంవత్సరంలో 6 నుండి 10వ తరగతి వరకూ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 23 నుండి ఫిబ్రవరి 16 వరకూ ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. అభ్యర్ధులకు ఏప్రిల్ 11 నుండి 15వ తేదీ వరకూ హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచుతామని, ఏప్రిల్ 15న ప్రవేశపరీక్ష ఉంటుందని అన్నారు. ఆరో తరగతి వారికి ఉదయం 10 నుండి 12 వరకూ, 7వ తరగతి నుండి 10వ తరగతి వరకూ అడ్మిషన్లకు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకూ లిఖిత పరీక్ష ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎంపికైన వివరాలు మే 16 నుండి 19 వరకూ ఆన్‌లైన్‌లో ఉంచుతారు. మే 20 నుండి 26 వరకూ ధృవపత్రాల పరిశీలన జరుగుతుంది. ఇతర వివరాలను సంబంధిత పాఠశాలల్లో పొందవచ్చని అధికారులు చెప్పారు. తెలంగాణ ఎంఎస్ డాట్ సిజిజి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.

చిత్రం..సెయింట్ ప్యాట్రిక్స్ పాఠశాలలో విజ్ఞాన ప్రదర్శన ముగింపు
రోజున ఒక ప్రదర్శనను తిలకిస్తున్న గవర్నర్ నరసింహన్