రాష్ట్రీయం

నేటి నుంచి ఓపెన్ కాస్ట్ యాత్ర ప్రారంభించనున్న కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజెఎసి) ఆధ్వర్యంలో మంగళవారం ఉపరితల బొగ్గు గనుల (ఓపెన్‌కాస్ట్) అధ్యయన యాత్రను ప్రారంభిస్తున్నట్టు టిజెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌లో కొనసాగుతున్న దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత జయశంకర్ విగ్రహానికి నివాళులు ఆర్పించిన తర్వాత జెండా ఊపి యాత్రకు ప్రారంభించనున్నట్టు కోదండరామ్ తెలిపారు. ఆల్వాల్‌లో ఐదు గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర ఉదయం 9 గంటలకు ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌కు చేరుకుంటుందని ఆయన తెలిపారు. వివిధ జిల్లాలకు చెందిన బాధ్యులతో కలిసి ఆర్‌కె-ఓసిని సందర్శించాక, మందమర్రి సమీపంలోని ఎర్రగుంటపల్లిలో భూ నిర్వాసితులు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల బాధితులతో ప్రజాభిప్రాయ సేకరణ జరుపనున్నట్టు కోదండరామ్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయిన తర్వాత సాయంత్రం గోదావరి ఖనిలో జరిగే సదస్సులో బాధితులతో చర్చించి టిజెఎసి ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఆందోళనకు కార్యాచరణను రూపొందించనున్నట్టు పేర్కొన్నారు.
సిబిఐకి హైకోర్టు నోటీసులు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 2: కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు గతంలో జరిగిన భూ కేటాయింపులకు సంబంధించి తనపై సిబిఐ నమోదు చేసిన నేరారోపణలను కొట్టివేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి బిపి.ఆచార్య హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌ను సోమవారం విచారణకు స్వీకరించిన జస్టిస్ రాజా ఎలంగో సిబిఐకి నోటీసులు జారీ చేశారు. ఎమ్మార్‌కు జరిగిన భూ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడి రాష్ట్ర ప్రభుత్వానికి రూ.43 కోట్ల నష్టం వాటిల్లేలా వ్యవహరించారంటూ ఆచార్యపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిపై ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఈ కేసును వేసవి సెలవుల అనంతరం విచారించేందుకు వాయిదా వేస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐకి నోటీసులు జారీ చేశారు.
ఢిల్లీలో ధర్నా చేస్తా: విహెచ్
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, మే 2: న్యాయ వ్యవస్థతోపాటు, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావుడిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఇక్కడ జంతర్‌మంతర్ వద్ద విహెచ్ ధర్నా చేయనున్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో జడ్జిలుగా బిసిలు తక్కువమందే ఉన్నారని వాపోయారు. వెనుకబడిన వర్గానికే చెందిన ప్రధాని నరేంద్ర మోదీ న్యాయం చేస్తారనుకుంటే రెండేళ్లయినా బిసిలకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పారు. తాను చేపట్టిన ధర్నాకు ఓబిసి ఎంపీలతో పాటు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్టు హనుమంతరావు తెలిపారు. బిసిల సమస్యలను కేంద్రం పట్టించుకోవడం లేదన్న విహెచ్ కాంగ్రెస్‌లోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగందని స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు
మంత్రి కెటిఆర్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 2: డ్రైనేజీ పనిలో కూలీల మృతిపై మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావు కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబానికి ఆర్థిక సహాయం చేయనున్నట్టు చెప్పారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కూలీలతో పని చేయించిన ప్రైవేటు కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశించారు. డ్రైనేజీ సమస్యపై హెచ్‌ఎండబ్ల్యుఎస్‌ఎస్‌కు ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ప్రైవేటు వ్యక్తులతో డ్రైనేజీ శుభ్రం చేయించే ప్రయత్నం చేసినట్టు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఇకపై ప్రజలు ఎవరైనా డ్రైనేజీ కోసం ఫిర్యాదు చేస్తే పూర్తి స్థాయి జాగ్రత్తలతో సాధ్యమైనంత వరకు మిషన్ల సహాయంతో డ్రైనేజీ శుభ్రం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రమాదంతో ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకున్నా మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.
మహిళ కిడ్నాప్: సీసీటీవీలో నమోదు
బెంగళూరు, మే 2: ఈశాన్య బెంగళూరులో 22ఏళ్ల యువతిని పట్టపగలే అపహరించుకుపోయిన ఘటన విస్మయానికి గురిచేసింది. ఆమెను అపహరించుకుపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పేయింగ్ గెస్ట్ హాస్టల్ ముందు మొబైల్‌ఫోన్‌లో మాట్లాడుతున్న యువతిని వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి చేతులతో ఎత్తుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లాడు. కొద్దిసేపటి తరువాత ఆమెను వదిలేసి అతను పారిపోయాడు. జరిగిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నేను ఫోన్ మాట్లాడుతుండగా అతను వెనుకనుంచి వచ్చి పట్టుకున్నాడు.. నేను గట్టిగా అరవటంతో నా నోరు మూశాడు.. నన్ను నేను కాపాడుకోవటానికి ప్రయత్నించినప్పుడు గట్టిగా కొట్టడంతో భయంతో స్పృహ కోల్పోయాను. కొద్దిసేపటి తరువాత లేచి చూసే సరికి నా బ్యాగ్, మొబైల్ అక్కడే ఉన్నాయి. అతను లేడు. వీటిని బట్టి చూస్తే నా పై లైంగిక దాడికి పాల్పడటమే అతని ఉద్దేశం కావచ్చు’ అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టిఆర్‌ఎస్‌వి సెంటిమెంట్ రాజకీయాలు
పిసిసి ఉపాధ్యక్షురాలు డికె అరుణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 2: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి పంటలకు నీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టి.పిసిసి ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. టిఆర్‌ఎస్ నాయకులు ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆమె సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అవి బయటపడకుండా ఉండేందుకు తమ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు సర్వే పనులకు సుమారు 7 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసిందని, సర్వేలు చేయించి, డిపిఆర్ చేయించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని హరీష్ రావు చెబితే బాగుండేదని అన్నారు.