తెలంగాణ

నదుల అనుసంధానంపై అఖిలపక్షం నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: నదుల అనుసంధానంపై జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ నిర్వహించే సమావేశంలో పాల్గొనే ముందు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకోవాలని ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం చేయాలని భావించి అన్ని రాష్ట్రాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసిందని పొంగులేటి మంగళవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు 40 సంవత్సరాల నీటి లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు నదుల అనుసంధానికి గోదావరి వరద ప్రవాహం 110 సంవత్సరాల లెక్కలను సిడబ్ల్యుసి ప్రామాణికంగా తీసుకుంటోందని ఆయన తెలిపారు. 40 ఏళ్ళ వరదను పరిగణలోకి తీసుకంటే గోదావరిలో మిగులు జలాలు లేవని తేలిందని, దీంతో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన ఆందోళన వెలిబుచ్చారు. కాబట్టి ప్రామాణికంగా తీసుకునే వరద ప్రవాహ నీటి లెక్కల విషయంలో పునర్ నిర్ణయం తీసుకోవాలని కేంద్రంపై వత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.