తెలంగాణ

ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువ చివరి భూములకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పి) కాలువ చివరి భూములకు సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం 75.74 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఎస్‌ఆర్‌ఎస్‌పి ఆయకట్టులో రామగుండం మండలంలో కాలువ చివరన ఉన్న భూములకు (డి-83 లోని 17 ఎల్, 27 ఎల్ పరిధి భూములు) మూడు దశాబ్దాల నుండి సాగునీరు అందడం లేదు. దాంతో ఈ భూములకు సాగునీటిని అందించేందుకు ఆ యా ప్రాంతాల్లో ఉన్న చెరువులు, కుంటలను శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి ఎత్తిపోతల ద్వారా నీటిని తోడి రామగుండం మండలంలోని ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువ చివరలో ఉన్న 20 వేల ఎకరాల భూములకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఎత్తిపోతల పథకం కోసం 75 కోట్ల 74 లక్షల రూపాయలను మంజూరు చేశారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ శైలేంద్ర కుమార్ జోషి పేరుతో మంగళవారం జీఓ జారీ అయింది.