తెలంగాణ

నిర్బంధ, నియంతృత్వ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రంలో అణచివేత, నిర్భంధ, నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. చంచల్‌గుడా జైలులో ఉన్న ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను, గజ్వేల్ టిడిపి నాయకుడు ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని మంగళవారం ఉత్తమ్‌కుమార్ రెడ్డి కలిసి పరామర్శించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత, గిరిజన, బిసి వర్గాలపై పోలీసుల దమనకాండ, నిర్భందం రోజు, రోజుకూ పెరుగుతున్నదని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆయన తెలిపారు. ఎస్‌సిల్లో ఎ,బి,సి,డి వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ రెండు దశాబ్దాలకుపైగా పోరాటం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఇటీవల హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా జరుగుతున్నప్పుడు భారతీ మరణించిందని ఆయన చెప్పారు. భారతి కుటుంబాన్ని ఆదుకోవాలని, భారతి సంస్మరణ సభ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రయత్నించిన మంద కృష్ణను అడ్డుకున్నారని ఆయన తెలిపారు. చివరకు మంద కృష్ణ తన సొంత కార్యాలయంలో దీక్ష చేసినా అరెస్టు చేసి జైల్లో పెట్టడం ఎంత వరకు భావ్యమని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో మానవ హక్కులు రోజు, రోజుకూ కాలరాస్తున్నారని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లాలో రైతులు తమకు గిట్టుబాటు ధరలు కల్పించినా కోరినందున మిర్చి రైతులను దొంగలుగా చిత్రీకరించి కేసులు పెట్టి బేడీలు వేసి జైలులో పెట్టారని ఉత్తమ్ విమర్శించారు.