తెలంగాణ

కందుల కొనుగోలు పరిమితిని పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: కందుల కొనుగోలు పరిమితిని పెంచాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర మార్కెటింగ్ మంత్రి టి. హరీష్‌రావు బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. మార్కెటింగ్ కార్యక్రమాలపై సంబంధిత ఉన్నతాధికారులతో మంగళవారం ఆయన సచివాలయలం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన ఢిల్లీ పర్యటనపై కూడా హరీష్‌రావు ఉన్నతాధికారులతో చర్చించారు. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ మంత్రిని కలిసి కందుల కొనుగోలులో తెలంగాణలో ఎదురౌతున్న సమస్యలపై చర్చిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో ఈ సీజన్‌లో 33 వేల టన్నుల కందులు కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటి వరకు 26,200 టన్నుల కందులు కొనుగోలు చేశారు. కందిపంటకు వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉండటం వల్ల ఈ సీజన్‌లో 1.50 లక్షల టన్నుల కందులు మార్కెట్‌కు వస్తాయని అంచనావేశారు. ఈ పరిస్థితిలో జాతీయ, అంతర్జాతీయ మార్కె ట్ల పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకుని కందుల కొనుగోలుకు ఆధునిక విధానాలను అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. కందులు, మొక్కజొన్నకు సంబంధించి బకాయిల చెల్లింపులను వెంటనే చేయాలని మంత్రి ఆదేశించారు. కందులకు సంబంధించి 145 కోట్లు, మొక్కజొన్నకు సంబంధించి 21 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని ఈ సందర్భంగా తేలింది. గడ్డి అన్నారం మార్కెట్‌ను కోహెడకు తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి మూడు ప్రైవేట్ సంస్థలు తమ తమ ప్రణాళికలను ప్రెజెంటేషన్ ద్వారా తెలియచేశాయి. సమగ్ర ప్రాజెక్టు నివేదికను 15 రోజుల్లోగా ఇవ్వాలంటూ ఈ సందర్భంగా మంత్రి ఆ యా సంస్థల ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి, కమిషనర్ జగన్‌మోహన్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి పాల్గొన్నారు.

చిత్రం..సచివాలయంలో మంగళవారం మార్కెటింగ్ కార్యక్రమాలపై
సంబంధిత ఉన్నతాధికారులతో సమావేశమైన మంత్రి హరీశ్‌రావు