తెలంగాణ

గల్ఫ్ బాధితుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జనవరి 16: జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో గల్ఫ్ బాధితుడు రేగుల అంజనేయులు (35) ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం స్థానిక కార్గిల్ లేక్ చెరువులో శవమై కనిపించాడు. వివరాలు ఇలా ఉన్నాయ. సిరిసిల్లలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన అంజనేయులు దసరాకు ముందు ఉపాధి కోసం అప్పులు చేసి గల్ఫ్ వలస బాట పట్టగా నెల రోజులకే ఆయనను ఉన్న పళం గా తిరిగి వెన క్కి పంపారు. దీనికితోడు ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులు, ఎదుగుతున్న కూతురు, ఉపాధి సమస్య, అప్పుల భారం పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురై మృతి చెందినట్టు స్థానిక ఏఎస్సై రాంచందర్ వెల్లడించారు. దసరా పండుగకు ముందు అంజనేయులు ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్ళగా, అక్కడ వైద్య పరీక్షలో అనర్హుడిగా తేలడంతో ఉన్నట్టుండి ఆయనను స్వదేశానికి తిరిగి పంపారు. ఉన్నపళంగా తనను వెనక్కు పంపుతున్న వైనం చివరివరకూ ఆయనకు తెలియలేదు. ఆదివారం అంజనేయులు ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఆయన కోసం వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం ఆయన మృతదేహం కార్గిల్ చెరువులో తేలింది. తిరిగి పంపేవరకు ఆయనకు విషయం తెలియరాలేదు. ఇప్పటికే ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పుకు నెలా నెలా వడ్డీ చెల్లిస్తూ, మరింత అప్పుల పాలయ్యాడు. దీనితో ధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య లత ప్రస్తుతం ప్రాంతీయ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తూ ఇంటిని పోషిస్తోంది. కాగా, మృతుడికి భార్య లత, కూతురు అఖిల (12), అభినవ్ (8) ఉన్నారు.

చిత్రం..కార్గిల్ లేక్ చెరువులో శవమై తేలిన గల్ఫ్ బాధితుడు అంజనేయులు
*అంజనేయులు (ఫైల్ ఫోటో)