తెలంగాణ

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: మోడల్ పాఠశాలలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్ధల్లో పని చేస్తున్న 2 లక్షల 20 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మోడల్ స్కూల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ సంఘం ప్రధాన కార్యదర్శి కె. సంజీవ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కృష్ణయ్య ప్రసంగిస్తూ కాంట్రాక్టు, ఔట్‌సోరిర్సంగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం జివో జారీ చేస్తే కోర్టు స్టే ఇస్తుందన్నారు. న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు రాకుండా వీరిని రెగ్యులరైజ్ చేయడానికి వీలుగా అసెంబ్లీలో చట్టం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పాటు డేలీ వేజ్, పార్ట్ టైం, ఎన్‌ఎంఆర్, కంటెన్‌జెన్సీ తదితర ఉద్యోగులందరికీ పర్మెనెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గుజ్జ కృష్ణ, అహ్మద్ హుస్సేన్, భూపేష్ సాగర్, కడెం రవీందర్, కొమరయ్య, లక్ష్మయ్య, నగేష్, నర్సింగ్, చందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.