తెలంగాణ

జాతీయ ప్రాజెక్టును జాతీయ స్థాయి స్కాంగా మార్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుగా విభజన చట్టంలో పొందుపరిచిన జాతీయ స్థాయి ప్రాజెక్టు పోలవరంను జాతీయ స్థాయి స్కాంగా టీడీపీ ప్రభుత్వం మార్చిందని వైకాపా ధ్వజమెత్తింది. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వైకాపా అధికార ప్రతినిధి పార్థసారథి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణ జరిపితే ఒక నెల రోజుల్లోనే చంద్రబాబు పదవీచ్యుతుడై జైలుకెళ్లాల్సి ఉంటుందన్నారు. పోలవరం ప్రాజెక్టు టెండర్లు, ఇష్టారాజ్యంగా పెరిగిన ఎస్కలేటర్లు, కాంట్రాక్టు అక్రమాలపై వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకుని సిబిఐ విచారణ జరిపించాలన్నారు. పోలవరం అథారిటీ కూడా ప్రాజెక్టు అవతవకలను పరిగణనలోకి తీసుకుందన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని, బంగారు బాతుగా ఉపయోగించుకోవాలని చూస్తోందన్నారు. వైఎస్‌ఆర్ హయాంలో పునరావాసం, నష్టపరిహారాలతో కలిపి పోలవరంప్రాజెక్టు అంచనా వ్యయం రూ.10వేల కోట్లు కాగా, ఈ అంచనాలను రూ.58 వేల కోట్లకు చంద్రబాబు ఒకేసారి పెంచారని నిప్పులు చెరిగారు. పోలవరం కుడి, ఎడమ కాల్వల పనులు వైఎస్ హయాంలో 80 శాతం పూర్తయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టుకు పెంచిన అం చనాలను చూసి కేంద్రమే నిర్ఘాంతపోతోందన్నారు. గతంలో పరిటాల రవి హత్య, ఔటర్ రింగ్ రోడ్డు, వోక్స్‌వ్యాగన్ అంశాలపై అవకతవకలపై చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు రాగానే, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ సిబిఐ విచారణకు ఆదేశించి తన నిజాయితీని నిరూపించారన్నారు. సీఎం పోలవరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలన్నారు.