తెలంగాణ

మంద కృష్ణతో గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: ఎంఆర్‌పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా అరెస్టు చేసి కేసులు నమోదు చేసి జైలుకు పంపించిందని గుజరాత్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని విమర్శించారు. బుధవారం ఎమ్మెల్యే జిగ్నేష్ చంచల్‌గుడా జైలుకు వెళ్ళి మంద కృష్ణ మాదిగను కలిసి పరామర్శించారు. అనంతరం జిగ్నేష్ మీడియాతో మాట్లాడుతూ మాదిగల హక్కుల కోసం పోరాడే మంద కృష్ణపై ప్రభుత్వం అణచివేత ధోరణితో వ్యవహారిస్తున్నదని విమర్శించారు. దళితుల ఉద్యమాన్ని దేశ వ్యాప్తంగా చేపడతామని ఆయన తెలిపారు. తెలంగాణలో దళిత సంఘాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఎస్‌సి వర్గీకరణ తప్పని సరి గా చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నా రు. మంద కృష్ణ ఉద్యమం ఇప్పటిది కాదని గతంలో కూడా ఆయన ఉద్యమాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రభు త్వం మంద కృష్ణపై పెట్టిన కేసులను ఉపసంహరించి జైలు నుంచి విడుదల చేయించాలని జిగ్నేష్ డిమాండ్ చేశారు.