తెలంగాణ

22న కలెక్టరేట్ల ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 17: ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ఈ నెల 22న ‘్ఛలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. అణగారిన కులాలకు, పేదలకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రిలే నిరహార దీక్షలు నిర్వహించనున్నట్లు టి-మాస్ రాష్ట్ర కన్వీనర్ జాన్ వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ తర్వాత 22న ఛలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.