తెలంగాణ

వేల కోట్లు వెచ్చిస్తున్నా చదువు సున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: దేశవ్యాప్తంగా పాఠశాలవిద్య తీరుతెన్నులపై ప్రథమ్ సంస్థ నిర్వహించిన సర్వేలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి.
చిన్నచిన్న లెక్కలు, ఆంగ్లవాఖ్యాలు, కొలతలు, గుణింతాలు, భాగాహారం, కూడికలు, చిత్రపటాల్లో దేశాలు, రాజధానుల గుర్తింపులో భారతీయ చిన్నారులు చాలా వెనుకంజలో ఉన్నారని తేలింది. ఇది ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల వెనుకబాటుతనాన్ని సూచించింది. డిజిటల్ రంగంలో కొద్దిగా ముందంజలో ఉన్నా, మొత్తం మీద చదవుల్లో మాత్రం పురోగతి అంత గణనీయంగా లేదని తేలింది. ప్రథమ్ సంస్థ రూపొందించిన అసర్ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
చదువు, పాఠశాలల్లో అడ్మిషన్లు, వృత్తివిద్యా కోర్సు, పని అనుభవం, మొబైల్, ఇంటర్‌నెట్ , కంప్యూటర్‌లపై అవగాహన, బ్యాంకు అకౌంట్లు, డిపాజిట్లు, ఏటీఎం వినియోగం, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ తదితర అంశాలపై ఈ సర్వే నిర్వహించారు. విద్యార్థులకు చదివే సామర్ధ్యం, గణాంకాల సామర్థ్యం, వాక్యాలు, పదాలు, చిన్న చిన్న పదాలు పలకడం, డబ్బు గణించడం, కాలం గురించి చెప్పడం, పొడవు, బరువు, మానాలు చెప్పడం, బడ్జెట్ లెక్కింపు వంటి అంశాలపై కూడా ఈ సర్వే నిర్వహించింది. 14 నుండి 18 ఏళ్ల వయోపరిమితిలో 86 శాతం మంది సంప్రదాయ విద్య కొనసాగిస్తున్నారు. 14 ఏళ్ల ప్రాయంలో స్కూళ్లలో చేరని వారి సంఖ్య 15 శాతంగా ఉంది. అదే 18 ఏళ్ల ప్రాయం వారిని తీసుకుంటే అది 30 శాతం వరకూ ఉంది. ఐదు శాతం మంది యువత వృత్తి విద్యలో చేరుతున్నారు.
25 శాతం మంది తమ మాతృభాషలో కనీసం చదవలేకపోతున్నారని కూడా తేలింది. బాగాహారం 57 శాతం మందికి చేతకావడం లేదు. 43 శాతం మంది మాత్రమే ఖచ్చితంగా భాగాహారం చేస్తున్నారు. 14 ఏళ్ల వయస్సు వారిలో 53 శాతం మంది మాత్రమే ఇంగ్లీషు వాక్యాలు చదవగలుగుతున్నారు.
18 ఏళ్ల ప్రాయం వారిలో 60 శాతం మంది ఇంగ్లీషు వాక్యాలు చదువుతున్నారు. ఎనిమిదేళ్ల ప్రాయం వారిని తీసుకుంటే కనీసం ఇంగ్లీషు చదవడం, గణితం చేయడం చేతకావడం లేదు. కొంత నగదు చూపించి ఇదెంత అని ప్రశ్నిస్తే కేవలం 76 శాతం మంది మాత్రమే కరెక్టుగా చెప్పారు. కిలోగ్రాముల లెక్కలు 56 శాతం మంది చెప్పగలిగారు. సమయం విషయానికి వచ్చేసరికి 83 శాతం మంది చెప్పగలిగారు. మిగిలిన వారంతా తప్పు చెప్పారు. పొడవుకు సంబంధించిన లెక్కలను 86 శాతం మంది చెప్పగా, 14 శాతం మంది చెప్పలేకపోయారు. డిస్కౌంట్‌ల గురించి ప్రశ్నించగా 64 శాతం మంది చెప్పారు. దేశపటాలు చూపించి ప్రశ్నిస్తే 86 శాతం మంది గుర్తించగలిగారు. రాజధానులను 64 శాతం మంది చెప్పగా, ఏ రాష్ట్రంలో మీరు ఉంటున్నారు అనే ప్రశ్నకు 79 శాతం మంది కరెక్టుగా చెప్పారు. మ్యాప్‌లో రాష్ట్రాన్ని గుర్తించమంటే 42 శాతం మంది మాత్రమే గుర్తుపట్టారు. మొబైల్ ఫోన్ వినియోగంలో 73 శాతం మంది ముందంజలో ఉన్నారు.
28 శాతం మంది ఇంటర్‌నెట్ వినియోగిస్తుండగా, మరో 26 శాత మంది కంప్యూటర్లను వినియోగించగలుగుతున్నారు. 24 రాష్ట్రాల్లోని 1641 గ్రామాల్లో అభిప్రాయాలను తీసుకుని ఈ నివేదికను క్రోడీకరించారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరికి నిజామాబాద్ జిల్లాను పైలట్ జిల్లాగా తీసుకుని గణాంకాలను సేకరించారు. నిజామాబాద్ జిల్లాలో చదవడం వచ్చిన వారు 76 శాతం కాగా, 70.4 శాతం నమోదు రికార్డయింది. చదవడం, అర్ధం చేసుకోవడంలో 57.6 శాతం యువత ఉన్నారు. ఆర్ధిక సంబంధ లెక్కలు తెలిసిన వారు 67.7 శాతం మంది ఉన్నారు. 96.2 శాతం మంది భారత పటాన్ని గుర్తించగా, 54.2 శాతం మంది రాజధాని పేరును చెప్పారు.