తెలంగాణ

పాత నేరగాళ్ల చిట్టా బహిర్గతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: తెలంగాణ పోలీసు శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర నేరస్థుల సర్వేలో పాత నేరగాళ్ల జాతకాలు బయటపడుతున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరస్థుల గణన చేపట్టడంతో చాలా స్పష్టంగా వివరాలు వస్తున్నాయి. అవి పోలీసు రికార్డుల్లోకి ఎక్కుతున్నాయి. ఆ నేరస్థుడు ఉన్న నివాసాన్ని జియోట్యాగింగ్ చేయడం ద్వారా ఇక పూర్తి స్థాయి నిఘా ఉంచేందుకు మార్గం సుమగమైంది. సర్వేలో ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో వందలాది మంది పాత నేరగాళ్ల వివరాలు వెల్లడవుతున్నాయి. వీరి వివరాలు ఇప్పటికే పోలీసు రికార్డుల్లో ఉన్నప్పటికీ సమగ్రంగా వారి వివరాలు లభ్యం కావడం లేదు. అంటే నేరం ఒక చోట చేసి మరో చోట నివాసం, లేదా మరో ప్రాంతానికో, రాష్ట్రానికో వెళ్లిపోవడం జరుగుతోంది. ఇక ఆ అవకాశం లేకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. జేబు దొంగ నుంచి డ్రగ్స్ మాఫియాతో చేతులు కలిపిన వాళ్ల వరకూ, ఇళ్ల తాళాలు పగులగొట్టి పదే పదే నేరాలు చేసే ముఠాల నుంచి బ్యాంకు దోపిడీలు చేసే వాళ్ల వరకు, వైట్ కాలర్ నేరగాళ్లు, నకిలీ ధృవీకరణ పత్రాలు తయారు చేసే వారి వరకు అందరి గుట్టు రట్టు చేస్తున్నారు. నేరస్థుల గణనలో గతంలో కొందరు నేరాలు చేసి ఆ కేసుల్లో ఇంకా శిక్షలు పడక పోతే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ల వివరాలు సైతం వెల్లడవుతున్నాయి. వీటిలో కింది స్థాయి ప్రజాప్రతినిధులే కాకుండా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా ఉన్న వారి పేర్లు సైతం లభ్యమైనట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ నగరంలోనే 31 వేల మంది నేరస్థులు ఉన్నట్లు అన్ని జోన్ల నుంచి సమాచారం సేకరించారు. ఇంకా కొనసాగుతోంది. పహాడి షరీఫ్ ప్రాంతంలో జరిగిన సర్వేలో అదనపు డిజిపి అంజన్‌కుమార్ పాల్గొనగా, బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం.్భగవత్ పాల్గొన్నారు. తమ వద్ద ఉన్న నేరస్తుల వివరాలు, ఫొటోలను సర్వేలో ఆ ఇంటి వద్ద దొరికిన వారి వివరాలతో పోల్చుకుని, ఆ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 20 వేల మంది ఉన్నట్లు డీసీపీ విశ్వప్రసాద్ తెలిపారు. సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో హైదరాబాద్ సీపీ వివి శ్రీనివాసరావు సర్వేలో పాల్గొన్నారు. అలాగే సికిందరాబాద్, హైదరాబాద్ పరిధిలో రైల్వే పోలీసులు 2008 నుంచి ఉన్న 200 మంది పాత నేరస్తుల వివరాలను సేకరించారు. అందిన సమాచారం మేరకు హైదరాబాద్ నగర సెంట్రల్ జోన్ పరిధిలో 2269 మంది పాత నేరస్తులను గుర్తించారు. పాతబస్తీలో నేరస్తుడు అయూబ్‌ఖాన్ ఇంటికి వెళ్లి దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ నేతృత్వంలోని బృందం జియోట్యాగింగ్ చేశారు. నగర దక్షిణ మండలం మొత్తం మీది అంటే దాదాపు పాతబస్తీ అంతా కలిపి 11 వేల మంది నేరస్థులు ఉన్నట్లు గుర్తించారు. దాదాపు వెయ్యి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
నేరస్థుల స్వస్థలం ఆధారంగానే సర్వే
హైదరాబాద్ నగరంలో 60 పోలీసు స్టేషన్ల పరిధిలో 350 నుంచి 400 బృందాలు ఈ సర్వేలో పాల్గొన్నాయని హైదరాబాద్ సీపీ వివి శ్రీనివాసరావు తెలిపారు. సర్వే సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక పోలీసు స్టేషన్ పరిధిలో నేరాలు చేసి మరో పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటారని, ఆ కారణంగా నేరస్తుడు నివాస ప్రాంతాన్ని ఆధారం చేసుకుని ఈ సర్వే చేపట్టామని చెప్పారు. గతంలో సర్వే ఒక సారి సర్వే జరిగిందని, అప్పుడు కేవలం కొన్ని అంశాలపై మాత్రమే జరిగిందని చెప్పారు. ఇప్పుడు ఏకంగా జియో ట్యాగింగ్ చేసి నేరస్తుల కదలికలపై కనే్నసి ఉంచుతున్నాయమని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటూ నేరం చేసే వాళ్లు 31 వేల మంది ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటూ బయటకు వెళ్లి నేరాలు చేసే వాళ్లు 9 వేల మంది, నగరంలో నేరాలు చేసి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకునే వాళ్లు 3 వేల మంది ఉన్నారని సీపీ వెల్లడించారు. నేరాలు మానివేసేందుకు అక్కడికక్కడే కౌనె్సలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. నేరాలు మానివేసిన వారికి పోలీసుల నుంచి వేధింపులు ఉండవని చెప్పారు. అటువంటివారికి పునరావాసం, అవసరమైతే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.