తెలంగాణ

విద్యుత్ ఒప్పందాలపై చౌకబారు వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రం తక్కువ కాలంలో కెసిఆర్ పారదర్శకత, దూరదృష్టి వల్ల విద్యుత్ రంగంలో మిగులు విద్యుత్‌ను సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని,కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ విషయాన్ని ఓర్వలేక అవాకులు చవాకులు వాగితే సహించేది లేదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, సంక్షేమ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్టు ఎంప్లారుూస్ సంఘం శుక్రవారం ఇక్కడ మింట్ కాంపౌండ్‌లో ఏర్పాటుచేసిన క్యాలెంటర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్‌ను ఇవ్వడంలో విఫలమైన కాంగ్రెస్, ఈరోజు చౌకబారు వ్యాఖ్యలను చేయడం తగదన్నారు. తన మొండి వైఖరిని మార్చుకోని పక్షంలో కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెబుతారన్నారు. రాష్ట్రం లో 24 వ్యవసాయానికి విద్యుత్, పరిశ్రమలకు విద్యుత్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం వేల కోట్ల రూపాయల సబ్సిడీని భరిస్తూ పేద ప్రజలపైభారం మోపడం లేదన్నారు. విద్యుత్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇచ్చామని, కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాలు పెంచమన్నారు. టెండర్లు, ఒప్పందాల ద్వారా విద్యుత్ కొనుగోళ్లను పారదర్శకంగా ఖరారు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జెన్కోసిఎండి దేవులపల్లి ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్రం లో విద్యుత్ రంగం అద్భుతమైన విజయాలను సాధిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యోగులు హాజరయ్యారు.