తెలంగాణ

మద్యం సేవించి వాహనం నడిపిన 287 మందికి జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: నగరంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 287 మందికి ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నెల 1 నుంచి 19వ తేదీ మధ్య నగర ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిని నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటూ 2274 చార్జిషీట్లను దాఖలు చేశారు. వీరిలో చాలా మందికి జరిమానతో సరిపోగా, మరికొందరు జరిమాన చెల్లించని వారు, మరికొందరు మోతాదుకు మించి మద్యం సేవించిన వారందరిని కోర్టులో హాజరు పర్చారు. వీరిలో 287 మందికి జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ సైసెన్సు శాశ్వతంగా రద్దు, కొనే్నళ్లపాటు సస్పెండ్ చేస్తూ న్యాయస్ధానం తీర్పునిచ్చింది. ఇద్దరికి 30 రోజులు జైలు శిక్ష విధించగా, ఒకరికి 20 రోజులు, ఏడుగురికి 10 రోజులు, మరో ఏడుగురికి ఏడు రోజులు, నలుగురికి 6 రోజులు, 18 మందికి 5 రోజులు, 23 మందికి 4 రోజులు, 31 మందికి 3 రోజులు, 194 మందికి రెండు రోజులు జైలు శిక్ష విధించారు.
కాగా 16 మందికి శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్సు రద్దు చేయగా, 58 మందికి సస్పెండ్ చేశారు, ఒకరికి ఐదేళ్ల పాటు, ముగ్గురికి మూడేళ్లపాటు, 9 మందికి రెండేళ్లపాటు, 19 మందికి ఏడాది పాటు, ఏడుగురికి 6 నెలలు, 19 మందికి 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం జాయింట్ సిపి మాట్లాడుతూ డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడి శిక్ష విధించబడిన వారికి భవిష్యత్‌లో ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడమే కాకుండా విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు, విసాలు రావడం కష్టమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, డ్రంకన్ డ్రైవ్ నిరంతరం జరుగుతుందని తెలిపారు.