తెలంగాణ

దిగజారిన రాజ్‌భవన్ నైతిక విలువలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంగాధర, జనవరి 21: ప్రాజెక్టుల సందర్శనలో ప్రభుత్వ అభివృద్ధిని మెచ్చుకోవాలే కానీ, ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతిని విస్మరించి వ్యక్తులను పొగడడం రాజ్‌భవన్ నైతిక విలువలను దిగజార్చడంతో పాటు గవర్నర్ పదవిని ఒక పార్టీకి తాకట్టుపెట్టడం ఎంతవరకు సమంజసమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. గంగాధరలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన నర్సింహన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రస్తుతం గవర్నర్‌గా కొనసాగుతూ రాష్ట్ర ప్రభుత్వానికి భజనపరుడిగా మారారని ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో వివిధ పార్టీల నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలను అధికార పార్టీలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించిన రోజే రాజ్‌భవన్ నైతిక విలువలు మంటగలిశాయన్నారు. గవర్నర్ తీరును ప్రజలు గమనిస్తున్నారని, వ్యక్తులుగా కాకుండా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థించాలే కానీ ముఖ్యమంత్రికి, ఒక మంత్రికి భజన చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎల్లంపల్లి, కాళేశ్వరం, రామడుగు మండలం లక్ష్మీపూర్, మేడారం అండర్ టనె్నల్ ప్రాజెక్టులు రూపుదిద్దుకుని పనులు జరిగిన విషయాన్ని గవర్నర్ గుర్తించకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు ఆంధ్రాలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాలకు గవర్నర్ నరసింహన్ అధికార తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ బీజేపీ నాయకులు గవర్నర్‌ను మార్చాలని ఎందుకు ఒత్తిడి చేయడం లేదని, అదే ఆంధ్రా బీజేపీ నాయకులు గవర్నర్‌ను మార్చాలని ఒత్తిడి తెస్తున్నారని ఆయన గుర్తు చేశారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఒక మేధావి వ్యక్తులను ప్రశంసించడం సరికాదని, నిష్పక్షపాతంగా పనిచేయాలని పొన్నం హితవు పలికారు.