తెలంగాణ

చకచకా కొత్త బడ్జెట్‌కు రూపకల్పన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: వచ్చే ఏడాదికి సంబంధించి బడ్జెట్ రూపకల్పన చకాచకా సాగుతోంది. మార్చి 12వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లో సాగునీటికి భారీ ఎత్తున రూ.28వేల కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉంది. సంక్షేమ రంగానికి రూ..50 వేల కోట్లవరకు కేటాయించి దేశంలోనే సంక్షేమ రంగంలో అగ్రస్థానంలో నిలబలడాలని ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. గత బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రాష్ట్రప్రభుత్వం రూ.25వేల కోట్లను కేటాయిచింది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఇదే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత మొదటి దశలో చివరి బడ్జెట్ అవుతుంది. కాళేశ్వరంతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి తార్కికంగా ముగింపుదశకు తీసుకురావాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. కేంద్రం కూడా ఈ ప్రాజెక్టుకు నిధులను కేటాయించాలని ప్రభుత్వం వత్తిడి పెంచింది. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకాఎకిన రూ.12 వేల కోట్లు కేటాయించాలని ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అంనదాయి. రైతు రుణమాఫీ పథకం పూర్తికావడంతో, దీనికి కేటాయించిన నిధులను ఇకపై రైతులకు సబ్సిడీ కింద ఇవ్వనున్నారు.
ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రైతులకు పెట్టుబడి సాయం పథకం కింద ఇస్తారు. వ్యవసాయ విద్యుత్, సాధారణ విద్యుత్ సబ్సిడీ కలిపి దాదాపు రూ.10 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంది. మిషన్ భగీరథకు రూ.8వేల కోట్ల నిధులు, హైదరాబాద్‌తో సహా, మున్సిపల్ శాఖ అభివృద్ధికి రూ.12 వేల కోట్లు కేటాయించాలని ఆయా శాఖలు ప్రతిపాదనలు పంపాయి. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలు, వివిధ వృత్తి సంఘాలు, పెన్షన్లు, సామాజిక భద్రత, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు రూ.50వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది.
మార్చి 11న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఒకేసారి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని, ప్రతి గ్రామంలో ఒక నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమం ముగిసిన మర్నాడే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. కొత్తగా రానున్న రిజిస్ట్రేషన్ విధానం ప్రకారం 584 మండలాల్లో రిజిస్ట్రేషన్‌కార్యాలయాల ఉంటాయి. పట్టాదారుపుస్తకాల జారీ చేయడం, భూమి రికార్డుల ప్రక్షాళన, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ముగించి మార్చి 12వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అధికారయంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది.