తెలంగాణ

శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 21: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి పోలీస్ శాఖ మరింత పటిష్టమయ్యింది... నేర నియంత్రణలో మన పోలీసులు పూర్తి స్థాయిలో సఫలీకృతమవుతున్నారు... అందు కే అసాంఘిక శక్తులు నేరాలు చేసేందుకు భయపడిపోతున్నారు... దీంతో శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబ ర్ వన్‌గా నిలుస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో సరికొత్త సాంకేతి విధానాలతో నేరాలను అదుపు చేసేందుకు రాష్ట్ర పోలీసులు చేస్తున్న కృషిని కేంద్రం సైతం మెచ్చుకొని ప్రశంసించిందని అన్నారు.
పోరాటాల పురిటగడ్డ రామగుండమని, ఒకప్పు డు అన్నలకు అడ్డాగా ఉన్న కోల్‌బెల్ట్ ప్రాంతంలో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. శాంతి భద్రతలు, మత సామరస్యాన్ని కాపాడేందుకు కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. పోలీస్ శాఖ పటిష్టతకు త్వరగానే రూ. 350 కోట్లు మంజూరు చేస్తూ పోలీసుల సంక్షేమం పై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించుకు పోతూ దేశంలోనే గర్వించదగ్గ నెంబర్ వన్ సీఎంగా కేసీఆర్ నిలిచారని నాయిని తెలిపారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వానికి ప్రజా కోణం ఉందని, ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని, మరో పదేళ్ల వరకు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాల నే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ...రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని చెప్పా రు. ప్రజలకు మరింతగా పోలీసులను అందుబాటులో ఉంచేందుకే కమిషనరేట్‌ల ఏర్పాటు జరిగిందని, రాష్ట్రంలో 800 పోలీస్ స్టేషన్‌లలో ఒకే పోలీసింగ్ విధానం కొనసాగుతుందని వివరించారు.
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆర్టీసీ చైర్మన్ సొమారపు సత్యనారాయణ, మంథని, పెద్దపల్లి ఎమ్మెల్యేలు పుట్ట మధు, దాసరి మనోహర్ రెడ్డి, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, కలెక్టర్ దేవసేన, ఐజిలు నాగిరెడ్డి, మల్లారెడ్డి, రామగుండం సిపి విక్రమ్ జిత్ దుగ్గల్, ఎన్టీపీసీ రామగుండం ఇడి దిలీప్ కుమార్ దూబేతోపాటు రెండు జిల్లాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి