తెలంగాణ

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం అసెంబ్లీ ముట్టడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, జనవరి 23: ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే ప్రకటించి భర్తీ చేయాలని, లేకుంటే ఐదు లక్షల మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య గర్జించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బండారు గార్డెన్స్‌లో రాష్ట్ర కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ నిరుద్యోగ గర్జనలో పాల్గొని మాట్లాడారు. ప్రభు త్వం ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఉద్యోగ ప్రకటనలు, గారడి మాటలతో కేసీఆర్ వెళ్లదీస్తున్నాడని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి నాలుగేళ్లు కావస్తున్నా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. ప్రభుత్వం ఓట్లు, సీట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతుందనీ, మరోవైపు రాష్ట్రంలో 15లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసి పోస్టులను భర్తీ చేయాలన్నారు. అదే విధంగా రిటైర్ అయిన వారిని కొనసాగించకుండా వెంటనే తొలగించాలన్నారు. నల్లగొండ జిల్లా ఉద్యమాలతో దేశానికి సంకేతం పంపిన చరిత్ర కలిగిన జిల్లా అని, ఇక్కడి నుండే పోరాటాలు జరిగాయని, మరోమారు ఉద్యోగాల సాధనకై యువత, నిరుద్యోగులు కదలాలని కోరారు.
గత 40 సంవత్సరాలుగా విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యల పరిష్కారం, రిజర్వేషన్ల సాధనకై ప్రభుత్వాలతో కొట్లాడుతున్నామని, బంగారు తెలంగాణలో ఉద్యోగాల కోసం కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.

చిత్రం..బీసీ నిరుద్యోగ గర్జనలో మాట్లాడుతున్న ఆర్.కృష్ణయ్య