తెలంగాణ

ఫిరాయింపుదారులను చూస్తుంటే జాలేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: పార్టీ వీడి ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన వారిని చూస్తుంటే జాలి వేస్తున్నదని టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అనేది ఫిరాయింపుదారులకు వర్తిస్తుందని ఆయన తెలిపారు. పార్టీ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్)లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల్లో భాగంగా బుధవారం 4వ బ్యాచ్ శిక్షణా తరగతులు ముగిసాయి. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అనుభవం ఉన్న నాయకత్వం పార్టీకి ఉందన్నారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళుతున్నామని, బడుగు, బలహీనవర్గాల పార్టీగా గుర్తింపు ఉందని ఆయన తెలిపారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న వారిని ప్రత్యేక గ్రూపుగా తయారు చేసి వారి సూచనలు ఎప్పటికప్పుడు తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. నిరంతరం ప్రజలతో మమేకమై, వారి సమస్యలపై పోరాటం చేస్తూ, వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దామని ఆయన తెలిపారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్ రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడు రమావత్ లక్ష్మణ్ నాయక్, ఇతర నాయకులు నన్నూరి నర్సిరెడ్డి, తాజుద్దీన్, బుచ్చిలింగం తదితరులు ప్రసంగించారు. ఇలాఉండగా జనగాం జిల్లా అధ్యక్షునిగా బోట్ల శ్రీనివాస్‌ను, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు కోండపల్లి రాంచంద్ర రావును, భూపాల్‌పల్లి జిల్లా అడ్‌హక్ కమిటీ సభ్యులుగా చాడా రఘునథ్ రెడ్డి, యానాల అనంత్‌రెడ్డి, గడపర్తి నరసింహా మూర్తి, అరికేల ప్రమోద్‌ను రమణ నియమించారు.