తెలంగాణ

రాష్ట్రంలో రాచరిక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ రాచరిక పాలనకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు సాగించేందుకు లౌకిక, ప్రజాస్వామ విశాల వేదికకు త్వరలో అంకురార్పణ జరగనున్నదని ఆయన తెలిపారు. పార్టీ రాష్ట్ర సమితి కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలను, తీర్మానాలను బుధవారం పార్టీ కార్యదర్శివర్గ సభ్యుడు మల్లెపల్లి ఆదిరెడ్డితో కలిసి విలేఖరుల సమావేశంలో వివరించారు. పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు తేవాలన్న ఆలోచన చేయడాన్ని చాడ తీవ్రంగా వ్యతిరేకించారు. లౌకిక వ్యవస్థపై హిందుత్వ శక్తులు, సంఘ్ పరివార్, బిజెపి గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులకు దిగుతున్నాయని ఆయన విమర్శించారు. హిందుత్వ, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామ్య పార్టీలు, వామపక్షాలు కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.
గ్యాంగ్‌స్టర్ నరుూం డైరీని బయట పెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే నెల 12న బాధితులతో సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. చాడ అధ్యక్షతన బుధవారం పార్టీ కార్యాలయం (మఖ్ధూం భవన్)లో అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డిజి నరసింగరావు మాట్లాడుతూ ప్రతి రోజూ హత్యలు, భూ ఆక్రమణలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించాడని విమర్శించారు. నరుూంతో సంబంధాలు కొనసాగించిన పోలీసు ఉన్నతాధికారులపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో సిపిఐ-ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) నాయకులు హనే్మష్, సామాజిక కార్యకర్త సజయ, సిపిఐ-ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రాజేష్, సిపిఐ- ఎంఎల్ నాయకుడు భూతం వీరన్న, సిపిఐ రాష్ట్ర కార్యదర్శిర్గ సభ్యులు గుండా మల్లేష్, హైదరాబాద్ నగర సమితి కార్యదర్శి ఇటి నరసింహ ప్రసంగించారు.