తెలంగాణ

ఇద్దరికి రాష్టప్రతి పోలీసు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పతకాల్లో తెలంగాణ పోలీస్‌కు 21 పతకాలు లభించాయి. వీరిలో ఇద్దరికి రాష్టప్రతి పోలీసు పతకాలు, ఆరుగురికి గ్యాలంటరీ పోలీసు పతకాలు, 13 మందికి ఉత్తమ సేవాపతకాలు వచ్చాయి. ఆర్‌బివిఆర్‌ఆర్ తెలంగాణ పోలీసు అకాడమి డైరక్టర్ జితేందర్, హైదరాబాద్‌లో పని చేస్తున్న డిఎస్‌పి నరేందర్ నారాయణలకు రాష్టప్రతి విశిష్ట సేవా పతకాలు లభించాయి. జెసి జి.సురేష్, జెసి ఎం.మురళి, ఎఎసి బి.శ్రీరాములు, ఎఎసి వెంకట శ్రీనివాస్‌రెడ్డి, జెసి పి.లక్ష్మణుడు, జెసి హరీష్‌లకు గ్యాలంటరీ పోలీసు పతకాలు లభించాయి. ఉత్తమ సేవవలందించినందుకు గాను గ్రేహౌండ్స్‌లో గ్రూప్ కమాండర్‌గా పని చేస్తున్న మస్తీపురం రమేష్‌కు, అసిస్టెంట్ కమాండెంట్ డి.శివప్రసాద్‌రెడ్డి, అసిస్టెంట్ కమాండెంట్ పి.వీరాస్వామి, ఎసిపి రంగారావు, డిఎస్పీ నరేందర్‌సింగ్, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ శాంతి, ఇన్‌స్పెక్టర్ గడ్డిపల్లి రంగారెడ్డి, ఎస్‌ఐ పల్లె శంకర్‌రెడ్డి, ఎఆర్ ఎస్‌ఐ ఫయాజ్ అహ్మద్ షరీఫ్, హెడ్ కానిస్టేబుల్ వేమూరి శివానందరావు, అసిస్టెంట్ అస్సాల్ట్ కమాండర్ రాథోడ్ రోహిదాస్ నాయక్, జూనియర్ కమెండో పి.శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ఎం.సిద్ధయ్యలకు పోలీసు ఉత్తమ సేవా పతకాలు లభించాయి.
కేసీఆర్ అవినీతి