తెలంగాణ

పవన్‌కు కనిపించలేదా? ప్రశ్నించిన కాంగ్రెస్ నేత విహెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తామన్న సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ మాటే ఎత్తడం లేదని ఎఐసిసి నాయకుడు, మాజీ ఎంపి వి. హనుమంత రావు విమర్శించారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అవినీతి కనిపించలేదా? అని ఆయన బుధవారం విలేఖరుల సమావేశంలో పవన్‌ను ప్రశ్నించారు. అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుకు పేరు మార్చి రూ.50 కోట్ల అక్రమాలకు పాల్పడడం కనిపించ లేదా? అని ఆయన ప్రశ్నించారు. టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్‌ను తెలంగాణలో పర్యటించకుండా అడ్డుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పవన్‌కు ఎలా అనుమతి ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. పవన్‌పై అనేక ఆరోపణలు వచ్చాయని, వాటికి ఆయన సమాధానం చెబుతారా? అని విహెచ్ ప్రశ్నించారు. సంస్కృతిని కాపాడని పవన్ సమాజాన్ని ఏమి కాపాడుతారని ఆయన అన్నారు. ఇక్కడ రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరస్పరం ఆరోపణలు చేసుకుంటారని, దావోస్‌లో మాత్రం కలిసి ఫొటోలు దిగి మీడియాకు పంపించారని విహెచ్ విమర్శించారు.