తెలంగాణ

తొందరపాటు నిర్ణయాలు.. ఆపై సరిదిద్దుకునే యత్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ పాఠశాల విద్యాశాఖ తొందరపాటు నిర్ణయాలు చివరికి కొంపముంచుతున్నాయి. మాటమీద నిలబడలేక ప్రభుత్వానికి అపఖ్యాతి తెస్తున్నాయి. ముందూ వెనుక ఆలోచించకుండా అధికారుల నిర్ణయాలు ముందుకువెళ్తే నుయ్య, వెనక్కు వస్తే గొయ్య అన్న చందంగా తయారవుతున్నాయి. గత మూడేళ్లుగా ఏదో చేయాలనే తపన సత్ఫలితాలు ఇవ్వకముందే రివర్స్ అవుతున్నాయి. విద్యాసంవత్సరాన్ని మార్చిలోనే ప్రారంభించాలని నిర్ణయించి, విద్యాసంవత్సరాన్ని ప్రారంభించిన ప్రభుత్వం, తర్వాత ఎండలు విపరీతంగా పెరగడంతో దానిని విద్యార్థులు తట్టుకోలేరని సెలవులు ఇచ్చి , చివరికి పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలను అందజేయలేక విద్యాసంవత్సరం మార్చిలో కుదరదని పేర్కొని పాత పద్ధతిలో జూన్‌కు మార్చిరు. వేసవిలో ఒకే పూట పద్ధతి రద్దు చేస్తామని, చెప్పిన ప్రభుత్వం తొలుత రద్దు చేసి సాయంత్రం వరకూ స్కూళ్లను నడిపించి, చివరికి వేసవి తట్టుకోలేక మిగిలిన రాష్ట్రాలు సెలవులు ఇవ్వడంతో ఒకే పూట విధానానికి మారింది. ఎండాకాలంలో తినడం కోసం పిల్లలను స్కూళ్లకు రమ్మని చెప్పి, వారి కోసం టీచర్లను స్కూళ్లకు రప్పించి చివరికి వారికి ఇఎల్ మంజూరు చేయకపోవడంతో అదో వివాదం అయ్యిం ది. ఒకరోజు పెట్టే కాంప్లెక్స్ మీటింగ్‌లను మూడు రోజుల పాటు జరపమని చెప్పడం, కాంప్లెక్స్‌లు జరిగే ప్రదేశాలను అటు నుండి ఇటు ఇటు నుండి అటు మార్చడం ఆయా ప్రదేశాల కోసం టీచర్లు , యూనియన్లు బాహాబాహీకి దిగడం కొట్లాటలకు కారణమైంది. కులమతాలకతీతంగా ప్రభుత్వ పాఠశాలల్లో కలిసి మెలిసి చదువుకునే వారిని మోడల్ స్కూళ్లు, గురుకులాల పేరిట కులాలు, మతా లు వారీ పిల్లలను విడదీసి చదివించడంతో ఒక వర్గానికి చెందిన వారు మిగిలిన పిల్లలకు ఇమడలేక, మిగిలిన వారు వీరితో ఇమడలేక విభజన పద్థతి మానసికంగా అలవాటులోకి వచ్చేస్తోంది. బయోమెట్రిక్ తెస్తామని అందుకు ఏదో ఒక జిల్లానో మండలాన్నో పూర్తి ప్రాతిపదికన తీసుకోకుండా రాష్ట్రం మొత్తం లోని 25 శాతం స్కూళ్లు అని, స్కూళ్ల ఎంపికను నానా గలాటా చేసి పాఠశాలల మధ్య తగాదాలు పెట్టే రీతిలో అధికారులు వ్యవహరించారు. మధ్యాహ్న భోజనం స్కూలు పిల్లలు మొత్తానికి కలిపి బిల్లు వేస్తున్నారా అంటే దానికో విధానాన్ని అమలులోకి తెచ్చారు. గుడ్డు పెట్టిన రోజు బిల్లు, బిసి బిల్లు9 వేరు, ఎస్సీలు, మైనార్టీల బిల్లు వేరు, ఒసి పిల్లల బిల్లు వేరు, స్కూలులో ఉన్న మొత్తం పిల్లల్లో నుండి తిన్న వారిని లెక్కించి తీసేసి దానికి అసలు స్కూల్లో తినని వారిని కలిపి బిల్లులుచేయడం అంటూ సవాలక్ష విధానాలను వాడుకలోకి తెచ్చారు. ఆప్షనల్ హాలిడేస్‌ను స్కూలు పిల్లలకు ఇవ్వకుండా కేవలం టీచర్లకు మాత్రమే ఇవ్వడంతో విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నా ఆ రోజు టీచర్లు రాని పరిస్థితి నెలకొంది. ప్రైమరీ టీచర్లు తమ సెలవు కోసం కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఎంఇఓల చుట్టూ తిరగమనడం, ఇవి చాలవన్నట్టు ఇందులోకి జిల్లా రెవి న్యూ యంత్రాంగం కూడా దూరి, రకరకాల గ్రేడింగ్ పరీక్షలు నిర్వహించడంతో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.