తెలంగాణ

బతుకమ్మ సందర్భంగా మృతి చెందిన సృజన కుటుంబానికి రూ. 10 లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: బతుకమ్మ పండుగ సందర్భంగా ఎల్‌బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొనడానికి వచ్చి ప్రమాదవశాత్తూ మృతి చెందిన సృజన కుటుంబానికి రూ. 10 లక్షల సహాయాన్ని సాంస్కృతికశాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ బుధవారం అందజేసారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షలు, తెలంగాణ జాగృతి సంస్థ తరఫున మరో రూ. 5 లక్షలు కలిపి మొత్తంగా రూ. 10 లక్షలను సృజన కుటుంబానికి అందజేసినట్టు మామిడి హరికృష్ణ వివరించారు. ఈ మొత్తాన్ని మృతురాలు సృజన కుమార్తె, కుమారుని పేరిట బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు ఇప్పించడమే కాకుండా తెలంగాణ జాగృతి తరఫున ఐదు లక్షల సహాయం చేయడం పట్ల సృజన తండ్రి సూర్యనారాయణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.